Lose Weight and Boost Energy: వెయిట్ లాస్ అవ్వాలంటే రకరకాల పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే, ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటూ బరువు తగ్గడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. సరైన ఆహార అలవాట్లతో మంచి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు. వెంనటే బరువు తగ్గాలనే తాపత్రయంలో ఆరోగ్యం దెబ్బతీసుకొనే బదులు.. దీర్ఘకాలికంగా ఇబ్బందులు లేని ఆహార అలవాట్లు బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మార్పులతో బరువు తగ్గుతారు..
ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అయితే, ఫలితాలు వెంటనే రావాలని ఆశించడం అంత శ్రేయస్కరం కాదు. బరువు తగ్గడం కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి. నిపుణుల సూచనలు పాటిస్తూ సరైన ఆహారం తీసుకోవాలి. తద్వారా మానసిక స్థితి, శక్తి స్థాయి, రూపం అన్నింట్లోనూ మార్పులు గమనించవచ్చు. వికారం, ఉబ్బరం వంటి లక్షణాలను కూడా నివారించవచ్చు.
రోజువారీ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల పోషకాహారం లభిస్తుంది. అల్పాహారంలో చిన్న పండు ముక్క, స్నాక్ లో ఒకటి, ఇలా క్రమంగా పండ్లు అలవాటు చేసుకోవాలి. క్రమంగా వాటి సంఖ్య పెంచాలి. రోజూ కనీసం ఐదుసార్లు ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవాలి. డైట్ ఫాలో అవుతూ వీటిని పెంచాలి.
Lose Weight and Boost Energy:
తృణ ధాన్యాలు తీసుకోవాలి. వైట్ రైస్ ను తగ్గంచాలి. తృణ ధాన్యాలు జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా తినడం తగ్గిస్తారు. దీంతో పాటు తగినంత నీరు తాగుతూ ఉండాలి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్లు నీరు తాగాలి. అలాగే బీన్స్, ఎండు బఠాణీలు, చిక్ పీస్, కాయ ధాన్యాలతో సహా తినదగిన విత్తనాలు తీసుకుంటూ ఉండాలి.