Neha Dhupia : ఎంటీవీ రోడీస్‌లో గ్యాంగ్ లీడర్‌గా ఉంటూ తనదైన స్టైల్స్‌తో అందరిని ఆకర్షిస్తున్న బాలీవుడ్ నటి నేహా ధూపియా చాలా రోజుల తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసింది. స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌ను ధరించి క్రేజీ లుక్స్‌తో తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఎల్లో కలర్ కఫ్తాన్ లో అదిరిపోయే పోజులు ఇస్తూ దిగిన పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .

Neha Dhupia : ఫ్యాషన్ పట్ల నేహా ధూపియాకు మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైలే అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. స్టైలిష్ రెడ్ కార్పెట్ అవుట్‌ఫిట్స్ నుంచి సంప్రదాయ వస్త్రధారణ వరకు నేహా ధూపియా ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా అందరి చూపును ఇట్టే ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 6 మిలియన్‌లకు పైగా ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని నిరుత్సాహ పరచకూడదన్న ఉద్దేశంతో ఈ భామ పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌ను పంచుకుంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటుంది.

ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబు జానీ , సందీప్ ఖోస్లాలు డిజైన్ చేసిన అద్భుతమైన కలర్‌ఫుల్ కఫ్తాన్ అవుట్‌ఫిట్ వేసుకుని అందమైన ఫోటోలు దిగి మరోసాని ఫ్యాన్స్‌ను అలరించింది నేహా.

ఈ ఎల్లో కలర్ కఫ్తాన్ డ్రెస్‌లో నేహా ఎంతో హాట్‌గా కనిపించింది. బీడ్స్ వర్క్‌తో ఎంతో అందంగా ఈ అవుట్‌ఫిట్‌ను రూపొందించారు డిజైనర్స్. థై హై స్లిట్‌తో , వీ నెక్‌లైన్‌తో వచ్చిన ఈ డ్రెస్‌ను ధరించి కెమెరాకు క్రేజీ ఫోజులను ఇచ్చి కుర్రాళ్ల చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇన్‌స్టాలో ఈ పిక్స్ ను పోస్ట్ చేసిన నేహా ‘ఫైండ్ యువర్ సన్‌షైన్’ అని క్యాప్షన్‌ను జోడించింది.

పంజాబ్ సిక్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి నేహా ధూపియా. ఈ నటి తండ్రి ప్రదీప్ సింగ్ ధూపియా ఇండియన్ నేవీలో లో కమాండర్‌గా పనిచేశారు. అందాల ప్రపంచంపై ఆసక్తితో మోడల్ గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత బుల్లితెరలో కొన్ని సీరియల్స్‌లో నటించింది. 2002లో ఫెమీనా మిస్ ఇండియాగా గెలిచి అదే సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పదో స్థానంలో నిలిచింది. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్‌లో నేహా ఖయామత్ అనే సినిమాలో నటించింది. హిందీ , తెలుగు, మలయాళం, పంజాబీ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అంతే కాదు బుల్లితెరలో ప్రసారమయ్యే ఎంటీవీ రోడీస్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తోంది నేహా.