యశోధర్ మాళవికతో కలిసి లాయర్ దగ్గరికి వెళ్తాడు. మాళవిక జరిగిందంతా చెప్తుంది. అది విని చాలా కాంప్లికేటెడ్ కేసు అంటాడు లాయర్. ఎలాగైనా నన్ను కాపాడమని మాళవిక యశ్‌ని వేడుకుంటుంది. అక్కడ బావ చెప్పిన మాటలు విన్న వేద భర్తని కలిసేందుకు హోటల్‌కే వెళ్లాలనుకుంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 28 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
భర్తని సర్‌ప్రైజ్ చేసేందుకు హోటల్‌కి వెళ్తుంది వేద. కూర్చుని మాట్లాడుకుంటే మనసు తేలికపడుతుందని నమ్ముతుంది. అక్కడ యశోధర్ వేదకు కాల్ చేస్తాడు కానీ ఫోన్ కలవదు. ఆ తర్వాత హోటల్లో ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతుంది. యశోధర్ మాళవికను తీసుకుని బయటికి వస్తుండగా పడిపోతుంది తను. మాళవికను చేతుల మీద ఎత్తుకుని యశోధర్ బయటికి రావడం చూసి వేద షాకవుతుంది. బయట నిల్చున్న వేదని చూసి యశోధర్ కూడా కంగుతింటాడు. మాళవికను కారులో ఎక్కించుకున్న యశోధర్ మనసులోనే వేదకు సారీ చెప్పుకుంటాడు. టైం వచ్చినపుడు అంతా చెప్తానని అనుకుంటాడు వేదని ఉద్దేశించి. భర్త మాళవికతో వెళ్లడం చూసి తట్టుకోలేకపోతుంది వేద.
సీన్ కట్ చేస్తే.. అభిమన్యు మాళవికకు ఫోన్ చేయాలనుకుంటాడు. కానీ మాజీ మొగుడితో గడపుతుందేమోనని కోపం వచ్చి ఫోన్ విసిరేస్తాడు. అంతలోనే కైలాష్ వచ్చి అడిగినా ఇది మా పర్సనల్ ఇష్యూ.. నువ్ జోక్యం చేసుకోవద్దు అంటాడు అభి. మీ ఉప్పు తిన్నా.. మీ మందు తాగినా మీకు సపోర్ట్‌గా ఉండకపోతే ఎలా బ్రో అని అంటాడు కైలాష్. మీ విషయంలో సిస్టర్ చేస్తుంది చాలా రాంగ్ బ్రో. తన కోసం ఇన్ని చేసిన మిమ్మల్ని పక్కన పెట్టి మాజీ మెుగుడితో తిరగడం నాకు నచ్చట్లేదు. మీరెలా భరిస్తున్నారు అంటూ అభిని రెచ్చగొడతాడు కైలాష్. ‘నా చేతిలో ఉన్న అందమైన గాజు బొమ్మ మాళవిక. నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా’ అని శపథం చేస్తాడు అభి. ‘బంగారం నీ అభి డార్లింగ్‌ని రాంగ్ సైడ్ టచ్ చేశావ్. గుర్తుండిపోయే గుణపాఠం చెప్తా’ అని బయల్దేరతాడు అభి. దాంతో.. కాపురాల్లో నిప్పులు పోయడంలో ఈ కైలాష్ రూటే సెపరేట్ అని విర్రవీగిపోతాడు కైలాష్.
ఆ తర్వాత వేద హోటల్లో చూసిన యశ్‌ని గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ‘నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. నా మనసు గాయపరిచేలా ఎందుకవుతుంది. ఎన్నిసార్లు పరిస్థితులతో రాజీ పడాలి’ అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మాళవికని తీసుకుని యశ్ ఇంట్లో వదిలేస్తాడు. ఆదిత్య వచ్చి ఏం జరిగింది మమ్మీ అని అడగ్గా.. జరిగిందంతా చెప్తుంది మాళవిక. అంతేకాకుండా యశ్‌ని పొగడుతుంది. ఫోన్ వస్తుందని యశ్ బయల్దేరుతుండగా ఆది కాసేపు ఉండమంటాడు. ఆలస్యం అయిందని చెప్పి ఇంటికెళ్తాడు యశ్. ‘అన్నింటిని వదిలేసి దూరంగా పోవాలని ఉంది. కానీ నా ఖుషీని వదిలి పోలేనే’ అంటూ ఏడుస్తుంది. అంతలోనే ఖుఫీ వచ్చి వేద కళ్లు మూస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావా? అని అడగ్గా.. లేదని చెప్పి సర్ది చెప్తుంది వేద. నేను బతికేది నీకోసం అమ్మా.. అమ్మా అన్న పిలుపు కోసమే నేను ఉన్నది అంటూ ఎమోషనల్ అవుతుంది వేద. మరి ఇంటికెళ్లిన వేద, యశోధర్‌ల మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..