రుక్మిణి, ఆదిత్యలు దేవి కోసం వెతుకుతూనే ఉంటారు. దేవి ఆచూకీ తెలియకపోవడంతో ఆదిత్య రుక్కు మీద మండిపడతాడు. అపుడే ఓ వ్యక్తి దేవినీ తీసుకెళ్లడం తను చూశానంటూ అందుకు సంబంధించిన వివరాలన్నీ చెప్తాడు. దాంతో ఆదిత్య, రుక్కులు హుటాహుటిన ఆ ప్రదేశానికి బయల్దేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో అక్టోబర్ 27 ఎపిసోడ్‌లో చూద్దాం..
రాధకు ఫోన్ చేసి దేవి కనిపించదా అమ్మా? అని అడుగుతుంది చిన్మయి. ఆఫీసర్ సారూ నేను చెల్లిని తీసుకుని వస్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రాధ. దేవమ్మ గురించి తెలిసిందని చిన్మయికి ఎందుకు చెప్పావ్.. దొరక్కముందే ఎందుకు చెప్పావ్? తెలిస్తే ఆ మాధవ్ ఏం ప్లాన్ చేస్తాడో అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు ఆదిత్య. అక్కడ చిన్మయి వెళ్లి ఇంట్లో వాళ్లందరికి దేవి ఆచూకీ దొరికిందని చెప్పి సంబరపడిపోతుంది. చెల్లెలు వచ్చేసరికి తనకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టమని చెప్తుంది భాగ్యమ్మతో. ఆ శుభవార్త విని అందరూ దేవుడికి మొక్కుకుంటారు. అక్కడు సూరి, బాషాలు కాసుల కోసం కక్కుర్తి పడి బొక్కాబోర్లా పడతారు.
దేవమ్మ ఆచూకీ తెలిసిందని మాట్లాడుకోవడం వింటాడు మాధవ్. చిన్మయి మాధవ్‌తో చెల్లెలు ఎక్కడుందో తెలిసిపోయిందంటూ నిజం చెప్పేస్తుంది. దాంతో మాధవ్ షాకవుతాడు. ఓహో అది మన ఏరియానే కదా అనుకుంటాడు మాధవ్. అక్కడ దేవుడమ్మకు ఆదిత్య ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయి. అసలు వాడి జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదంటుంది. బహుశా వాడు మనతో ఏదైనా చెప్పడానికి ఆలోచిస్తున్నాడేమో అంటాడు ఈశ్వర ప్రసాద్. సత్యని ఆదిత్యకు ఫోన్ చేయమంటుంది దేవుడమ్మ. దాంతో భర్తని మనసులోనే తిట్టుకుంటుంది సత్య.
సీన్ కట్ చేస్తే.. సత్య మాధవ్ ఇంటికి వెళ్లగా అక్కడ భాగ్యమ్మ కనిపిస్తుంది. నువ్వేంటమ్మా ఇక్కడ అని షాకవుతుంది. చెప్తా రా అని పక్కకు తీసుకెళ్తుంది భాగ్యమ్మ. నువ్ ఇక్కడే ఉంటున్నావా? అంటే అక్క గురించి నీకు అంతా తెలుసా? నువ్ ఇక్కడ ఉన్నా ఇంత జరుగుతున్నా సైలెంట్‌గా ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటుంది. భాగ్యమ్మ చెప్పేది కూడా వినదు సత్య. అక్క త్యాగం పేరుతో అన్నీ మార్చుకుని ఇక్కడకు వచ్చింది. మరి నువ్వేం మార్చుకున్నావమ్మా. ఇద్దరం నీ కూతుళ్లమే కదమ్మ.. నీకు నేను అవసరం లేదా అంటుంది. రుక్కవ్వ కష్టాల్లో ఉందంటుంది భాగ్యమ్మ. అక్క ఒక జీవితం ఏర్పరుచుకుంది. నా జీవితమే ఇలా అయిపోయిందంటూ ఎమోషనల్ అవుతుంది సత్య. తప్పుగా అర్థం చేసుకోకు సత్యవ్వా అని భాగ్యమ్మ ఎంత చెప్పినా వినిపించుకోదు. తల్లిగా నువ్ ఇద్దరు కూతుళ్లు బాగుండాలని కోరుకోవాలి కానీ నువ్ నన్ను వదిలేశావా అమ్మా అంటూ ఏడుస్తుంది. నాకు నువ్ ఒకటి రుక్కవ్వ ఒకటి కాదంటుంది భాగ్యమ్మ. అక్క పూర్తిగా మారిపోయిందని సత్య మాట్లాడడం వింటుంది చిన్మయి.
నాకు అక్క త్యాగం చేయకపోయిన పర్లేద కానీ అన్యాయం చేయకని చెప్పమ్మా. తల్లిగా నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నువ్ అయినా నాకు న్యాయం చేయమ్మా.. అని తల్లిని వేడుకుంటుంది సత్య. చిన్మయి ఏం అర్థం కాక ఆలోచనలో పడుతుంది. అక్కడ ఆదిత్య దేవి మాటల్ని గుర్తు చేసుకుంటూ మదనపడతాడు. ‘పెనిమిటి.. ఆ గుడి దగ్గర ఓసారి కారు ఆపు అంటుంది’ రుక్కు. ఎందుకని అడగ్గా.. నువ్ ఆపు నేను చెప్తానంటుంది.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ కొడుకు గది శుభ్రం చేస్తుంది. అపుడే ఓ బుక్‌లో ఆదిత్య దాచుకున్న రుక్మిణి ఫొటో కనిపిస్తుంది. అది చూసి కంగుతింటుంది. ఇదేంటి వీడి పుస్తకంలో రుక్మిణి ఫొటో ఉందంటే ఇంకా వీడి మనసులో నుంచి రుక్మిణి పోలేదా. లేక వీడి జీవితంలోకి మళ్లీ వచ్చిందా? లేక సూరికి కనిపించినట్టు ఆదిత్యకు రుక్మిణి కనిపించిందా? మరి నా దగ్గర ఎందుకు దాస్తున్నాడు? అనుకుంటుంది తనకు తానే. మరి దేవిని వెతికి పట్టుకుంటారా? లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..