నిన్నటి ఎపిసోడ్‌లో వేద పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా స్కూల్‌కి బయల్దేరుతుంది. దారిలో యశోధర్ మాళవికతో కనిపిస్తాడు. వేదని చూసిన మాళవిక తనని ఇంకా రెచ్చగొట్టాలనుకుంటుంది. మాళవికకు యశ్ ముద్దు పెడుతున్నట్లు కనిపించడంతో వేద గుండె బద్ధలవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
యశోధర్ మీద తన తల్లికి ఉన్న నమ్మకం చూసి వేద విలవిలలాడిపోతుంది. నిజం చెప్పలేక కుమిలిపోతుంది. అక్కడ యశోధర్‌తో మాళవిక నేను నీ భార్యనే కదా అంటుంది. ఒకప్పుడు నువ్ నా భార్యవి అంటూ పంచ్ ఇస్తాడు యశ్. నేను కేవలం నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నా. మనిద్దరి మధ్య భార్యభర్తల బంధం ముగిసిన అధ్యాయం. నువ్ చేసిన పనికి నువ్వంటే నాకు అసహ్యం. నీతో మాట్లాడుతున్నది కేవలం నా ఆది కోసమని తేల్చి చెప్తాడు యశోధర్. వేద నాకోసం ఎంత త్యాగం చేసింది.. అంటూ భార్యకు చేస్తున్న మోసాన్ని తలుచుకుంటూ గిల్టీగా ఫీలవుతాడు. వేద మంచితనమే నా ధైర్యం అంటూ భార్యని పొగడతాడు.
ఆ తర్వాత సీన్‌లో సులోచన వంటగదిలోకి వెళ్లి కాఫీ పెడుతుంటే వేద వచ్చి అడ్డుకుంటుంది. బావగారు మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకువస్తాను అంటుంది వేద. అక్కడ లాయర్‌తో మాళవిక జరిగిందంతా చెప్తుంది. అది విని కేసు పైకి సింపుల్‌గా అనిపిస్తున్నా చాలా కాంప్లికేటెడ్ అంటాడు లాయర్. పరధ్యానంలో ఉన్న వేదని చూసి ఏమైందని నిలదీస్తాడు బావ. దాంతో వేద జరిగిందంతా చెప్తుంది. యశోధర్ అలా ఎలా చేశాడు? ఆదికి సంబంధించిన విషయమై ఉండొచ్చని సర్ది చెప్తాడు తను. నేను వాళ్లని కలవకూడదని రూల్ పెట్టలేదు కదా నాకు అబద్ధం చెప్పడం ఎందుకు? నా స్థానంలో మీరుంటే ఎలా అనిపిస్తుందని బావని అడుగుతుంది. భార్యాభర్తల మధ్య మూడో మనిషి రాకూడదని అంటాడు తను. పరిష్కారం నీ చేతిలోనే ఉంది వేద. గోరంత దాన్ని కొండంత చేసుకోకు. క్లారిటీగా మాట్లాడి తెలుసుకో అని సూచిస్తాడు వేదకు బావ.
అక్కడ మాళవిక తనని ఎలాగైనా కాపాడమని లాయర్‌ని రిక్వెస్ట్ చేస్తుంది. అపుడే వేద యశోధర్‌కు ఫోన్ చేస్తుంది. కాల్ కట్ చేస్తాడు యశ్. కట్టుకున్న భార్యకి కన్న కొడుకు ఇచ్చిన మాట మధ్య మీరు ఎంత నలిగిపోతున్నారో నాకు తెలుసు అంటాడు లాయర్ యశోధర్‌తో. మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలని అంటాడు లాయర్‌తో. వేద వసంత్‌కు ఫోన్ చేసి యశ్ గురించి అడుగుతుంది. నేను ఇప్పుడే కనుక్కుని చెప్తానంటాడు తను. వసంత్ ఫోన్ లిఫ్ట్ చేసిన యశోధర్ తను ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. వదినకు ఫోన్ చేసి మాట్లాడమని హితబోధ చేస్తాడు వసంత్. మళ్లీ వసంతే వేదకు ఫోన్ చేసి యశ్ గురించి చెప్తాడు.
ఆ తర్వాత లాయర్ యశోధర్‌తో వేద అంటే ఎవరు? తను ఇంతకు ముందే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు గురించి సీరియస్‌గా మాట్లాడారట అంటాడు. దాంతో మాళవికలో భయం పెరిగిపోతుంది. మావంతు ప్రయత్నం చేస్తామని చెప్పి వెళ్లిపోతాడు లాయర్. భయపడుతున్న మాళవికకు ధైర్యం చెప్తాడు యశ్. హోటల్ నుంచి బయల్దేరే టైంలో యశ్ వేదకు ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ కలవదు. దాంతో త్వరగా ఇంటికి వెళ్లాలనుకుంటాడు యశ్. అక్కడ వేద డైరెక్ట్‌గా హోటల్‌కే వెళ్లాలనుకుంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..