Vastu Tips: మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా దానం గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇలా దానం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ సమయంలో దానం చేయాలి మరియు ఏ సమయంలో దానం చేయకూడదు అనే విషయంపై కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే సూర్యాస్తమయంలో ఇలాంటి వస్తువులు అసలు దానం చేయకూడదట అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే సూర్యాస్తమయంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభం మాట అటు ఉంచితే దుష్ప్రభావాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక చీకటి పడిన తర్వాత చేసే దానాలకు అసలు అర్ధం ఉండదు మరియు కొత్త చిక్కులను తెచ్చిపెడతాయి. అయితే సూర్యాస్తమయం తర్వాత మీ పొరుగువారైనా లేదా మీకు అత్యంత సన్నిహతులైనా సరే ఇలాంటి వస్తువులను దానం చేయకండి. పెరుగు అనేది శుక్రుడుని సూచిస్తుంది. శుక్రుడు అంటే సంపదకు కారణం. సూర్యాస్తమయం తర్వాత పెరుగుని దానం చేస్తే మీరు సంపద, ఆనందం కోల్పోయి మీ ఇంట్లో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఇక సాయంకాల సమయంలో పసుపు ని మాత్రం అసలు దానం చేయకండి. పసుపు బృహస్పతిని సూచిస్తుంది. ఇలా పసుపుని సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం వల్ల
గురువు బలహీనపడుతాడని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా మీ ఇంట్లోని డబ్బు ని మీరే బయటికి పంపించిన వారు అవుతారు.
Vastu Tips:
సాయంకాల సమయంలో పాలను దానం చేయకండి. ఎందుకంటే పాలు లక్మి దేవి రూపంగా భావిస్తారు. ఇలా పాలను దానం చేయడం వల్ల మీకు భారీ ఖర్చు వచ్చి చేరుతుందని వాస్తు శాస్త్రం లో సూచించారు. డబ్బు లావాదేవీలను కూడా సాయంత్రం పూట జరపకండి. ఉల్లి పాయ వెల్లుల్లిని కూడా సూర్యాస్తమయం తర్వాత దానం ఇవ్వకండి. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ కేతు గ్రహానికి సూచికలు. ఇవి దానం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది.