Vastu Tips: వాస్తు శాస్త్రం మన జీవనవిధానంలో భాగం. ఇంటిని నిర్మించే సమయం నుండి.. డిజైన్, లేఅవుట్, కొలతలు, సూత్రాలు పాటిస్తాము. అవి మనకు పాజిటివ్ ఎనర్జీని కలిగించి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక ఇంట్లో ప్రతి గదికి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రాధాన్యతను అనుసరించి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటాయి. అలా మనం నిద్రించే, విశ్రాంతి తీసుకునే పడకగదికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది నిర్మాణంతో పాటు.. పడకగదిలో ఉండాల్సిన, ఉండకూడని వస్తువులు ఏంటో.. ఇప్పుడు చూద్దాం.
నిద్రిస్తున్నపుడు మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులపై జాగ్రత్త తీసుకోవాలి.. ఎందుకంటే అవి మన మనస్సు, మానసిక స్థితి, ప్రవర్తన, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో ఉండకూడని ముఖ్యమైన వస్తువులు..
సెల్ ఫోన్లు, వైఫై రూటర్లు, డార్క్ పెయింటింగ్స్, సాఫ్ట్ టాయ్స్, బాక్స్ బెడ్ పడకలపై నిద్ర మంచిది కాదు.
పడుకునేటప్పుడు సెల్ ఫోన్లు, వైఫై రూటర్లు రేడియేషన్ ద్వారా చేదు ఫలితాలు కలిగిస్తాయి. ఇక డార్క్ పెయింటింగ్స్ కూడా మైండ్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయి. సాఫ్ట్ టాయ్స్, బాక్స్ బెడ్ పడకలపై నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవన్నీ మనం నిద్రించే సమయంలో దగ్గరగా ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి. కావున వీటికి పడుకునే సమయంలో దూరంగా ఉండాలి. అంటే ఈ వస్తువులన్నీ అసలు బెడ్రూం లోనే ఉండకుండా చూసుకోవాలి.
Vastu Tips:
వాస్తు శాస్త్రానికి మరియు సైన్సు విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉంటాయని వాస్తు నిపుణుల మాట. వాస్తు పరంగానే కాకుండా.. సైన్స్ పరంగా కూడా మన చుట్టూ ఉన్న వస్తువులు మనపై ప్రభావం చూపిస్తాయి. ప్రశాంతత కలిగించే వస్తువులు దగ్గరగా ఉండడం మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతారు. కాబట్టి వాస్తు ప్రకారం పైన పేర్కొన్న వస్తువులు మీ నుండి దూరంగా ఉంచుకోవడం ద్వారా నెగెటివ్ ప్రభావాలకు దూరంగా ఉండండి.