Relation: తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే,కోపం వాళ్ళకే కాదు వాళ్ళ చుట్టుపక్కన ఉన్నవాళ్ళకు కూడా శత్రువు అయిపోయింది. కోపంగా లేదా స్ట్రెస్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఇదే మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలని అంటున్నారు.
కోపమే కాదు,స్ట్రెస్ డిజార్డర్ తో కూడా ఈ మధ్య చాలామంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని అంటారు నిపుణులు. ఎన్నో కారణాలు ఈ పరిస్థితికి దారి తీస్తాయని అంటున్నారు. ఆందోళన లేదా మూడ్ సరిగా లేకపోవడం కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేస్తుంది అనేది నిపుణుల మాట .
ఇరిటేషన్ మూడ్ లో ఉన్నవారిని శాంతింపచేయడానికి నిపుణులు కొన్ని సూచనలు చెపుతున్నారు. వారికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి.జున్ను,డ్రై ఫ్రూట్స్ లాంటి పదార్థాలు వారికి ఇవ్వాలి. ఎందుకంటే,ఈ పదార్థాల్లో ఉండే పోషకాలు మెదడు మీద మంచి ప్రభావం చూపి స్ట్రెస్ లేదా బాధని అధిగమించడానికి ఉపయోగపడుతుంది.బాదంపప్పులు,వాల్‌నట్స్,వేరుశెనగ,పిస్తా,పిండి పదార్థాలు లాంటి పదార్థాలు కూడా తీసుకోవచ్చు. ఇక ఇతర పదార్థాల విషయానికొస్తే చాక్లెట్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది
Relation:
.కళ్ళు తిరిగినప్పుడు చాలా మంది చిన్న చాక్లెట్ ముక్క తింటారు. అలాగే బాధగా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు ఒక చాక్లెట్ తినాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మనసు హాయిగా ఉంటే స్ట్రెస్ దరిచేరదు. గుడ్డు వెరీ గుడ్ అని మనకి తెలుసు. కొన్ని అధ్యయనాల ప్రకారం గుడ్లలో ఉండే ప్రొటీన్లు,విటమిన్ డి,బి-12 మెదడు మీద ప్రభావం చూపి స్ట్రెస్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అని నిపుణులు అంటారు.