Sleeping Tips: మనిషి జీవితంలో తప్పకుండా కావాల్సినవి కడుపు నిండా తిండి. కంటి నిండా నిద్ర. ఈ రెండిట్లో ఏవి లేకపోయినా జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇలా మనుషుల సమయపాలనలోను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల నిద్ర లేమి సమస్యలని ఎదుర్కొంటున్నారు. అయితే మనం కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ నిద్ర లేమిని దూరం పెట్టొచ్చు.
ఈ మధ్య కాలంలో డైటింగ్ పేరుతో చాలా మంది తమ నోళ్లకు తాళం వేసుకుని తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే డైటింగ్ చేసే వాళ్ళు రాత్రి పూట తక్కువ తినడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణం చేత నిద్ర లేమి సమస్య ఏర్పడుతుంది.అయితే డైట్ ని పాటించే వాళ్ళు ఆ సీజన్లో దొరికే పండ్లను తిని నిద్రపోతే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట బెల్లం తీసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు.
అలాగే ఈ మధ్య మనుషులు ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఇక రాత్రి పూట కూడా అసలు వదలట్లేదు. ఇక రాత్రి పూట ఫోన్ పట్టుకుని పడుకుంటే మనకు సమయం కూడా సరిగా తెలియదు. అలా ఆన్లైన్ లో ఏదో ఒకటి చూస్తూ ఉండిపోతాము. ఇలా చేయడం వల్ల మీ నిద్రకు ఖచ్చితంగా భంగం కలుగుతుంది. కాబట్టి పడుకునే సమయంలో సెల్ ఫోన్ ని దూరం పెట్టడం మంచిది.
Sleeping Tips:
అయితే సరిగా నిద్రపోకపోతే మాత్రం శారీరకంగా మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుంది. మీ చర్మం నిర్జీవంగా తయారవుతుంది. జుట్టుకు సంబందించిన సమస్యలు ఏర్పడుతాయి. రాత్రి పూట సరిగా నిద్రపోక పోతే ఆ మరుసటి రోజు అంతా మీ శరీరంలో నొప్పులు ఏర్పడుతాయి. తల నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.