Basil Benefits: తులసి చెట్టుని మన సంస్కృతిలో ఎంత పవిత్రంగా చూస్తామో అందరికి తెలిసిందే. ప్రకృతి ప్రసాదించిన అరుదైన ఔషధ మొక్క తులసి మొక్క. అందుకే ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే మన పూర్వీకుల నుంచి ఇంట్లో ఉంచుకొని పూజించే ఆచారం కూడా వారి నుంచే వచ్చింది. అంతే కాదు ఈ తులసిని పెరట్లో పెట్టుకోవడం వల్ల మరియు తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే.
నిజం చెప్పాలంటే దీర్ఘ కాలిక వ్యాధుల నియంత్రణలో తులసి సహాయపడుతుంది. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఇన్సులిన్ స్రావాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాలైన సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
కొంత మందికి దగ్గు, జలుబు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పటికి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే తులసితో తయారు చేసిన వేడి వేడి టీని తీసుకోవాలి. అలాగే దగ్గు ద్వారా గొంతులో వచ్చే శ్లేష్మాన్ని తొలగించడానికి తులసి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా తులసి ఉపయోగపడుతుంది.
Basil Benefit
ఈ మధ్య కాలంలో బీపీ పేషేంట్స్ కూడా ఎక్కువైపోతున్నారు. అయితే ఈ బీపీ ని కంట్రోల్ చేయడంలో కూడా తులసి అమోఘంగా పని చేస్తుంది. వేప, తులసి ఆకులని కలిపి తీసుకోవడం వల్ల హై బీపీ లెవెల్స్ తగ్గుతాయి. కిడ్నీ లో స్టోన్స్ తో ఈ మధ్య చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే తులసి ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.