India vs pakisthan ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఒక యుద్ధం లాగే ఉంటుంది. అయితే ఈ మధ్య ఈ రెండు జట్లు కేవలం అంతర్జాతీయ మ్యాచ్ లలోనే తల పడుతూ ఉండడంతో ఈ మ్యాచ్ లకి మరింత ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్ వెళ్ళింది. ఇలా ఇండియా పాకిస్థాన్ జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడడం అంటే అది మినీ యుద్ధం లాగే కనిపించింది.
అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 పరుగులు చేసింది. నిర్ధేశించిన లక్ష్యం అంత పెద్దదేమీ కాకపోయినా భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వకపోవడంతో తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం క్రీజుపై పాతుకుపోయి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు.
అయితే కోహ్లీ కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక హార్దిక పాండ్య కూడా 37 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక మిగిలిన వారందరు తక్కువ పరుగులకే పెవిలియన్ దారి పట్టారు. అయితే చివరికి 160 పరుగులు చేసి ఇండియా విజయం సాధించింది.
India vs pakisthan
అయితే చివరి ఓవర్లో మాత్రం విజయం దోబూచులాడింది. అయితే ఈ మ్యాచ్ ని మలుపు తిప్పింది మాత్రం నవాజ్ వేసిన నో బాల్. అయితే నడుము కంటే పైకి వచ్చిన ఈ బాల్ కి నో బాల్ ఇవ్వాలన్నట్టుగా విరాట్ కోహ్లీ అంపైర్లకి సిగ్నల్ ఇచ్చాడు. అయితే అంపైర్లు నో బాల్ గా ప్రకటించారు. అయితే దీనికి పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. అంపైర్ భయ్యా మీ ఆలోచనలకు నమస్కారం. మీకు ఈ రాత్రికి భోజనం పక్క అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ నిర్ణయాన్ని పాక్ ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు.