MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన లెజెండ్ గా ధోని కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ధోని.. వివిధ వ్యాపారాల మీద దృష్టిసారించాడు. అందులో భాగంగానే సొంతంగా క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ధోని.. పలు రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పే పనిలో ఉన్నాడు. అదే సమయంలో వివిధ టీవీ యాడ్స్ కూడా ధోని నటిస్తూ.. కొట్లు సంపాదిస్తున్నాడు.
తాజాగా ధోని సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టేశాడు. నిర్మాతగా మారేందుకు అంతా సిద్ధంగా కాగా.. ధోని ఎంటర్టైన్మెంట్ ను నెలకొల్పాడు. వివిధ భాషల్లో సినిమాలను నిర్మించాలని ధోని ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో తన భార్య సాక్షిని రచయితగా కూడా పరిచయం చేసే పనిలో ఉన్నాడు ధోని.
MS Dhoni:
ధోని ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన లోగో ఎంతో ఆసక్తిని రేపుతోంది. క్రికెట్ నుండి వచ్చిన ధోని.. సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తన మార్క్ స్టైలిష్ లోగోని తన ఎంటర్టైన్మెంట్ సంస్థకి పెట్టేశాడు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో క్రికెట్ ప్యాషన్ ని వ్యక్తపరిచేలా.. ‘D’ అనే అక్షరం, లోగోలో కెమెరాపై రెండు టెస్ట్ బాల్స్ ని పెట్టి ఉన్న డిజైన్ ఉంది. ధోని ఎక్కడ ఉన్నా క్రికెట్ ని మాత్రం మరువడు అన్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.