దేవిని వెతికేందుకు వెళ్లిన ఆదిత్య ఇంటికి వచ్చే వరకు భోజనం చేయనని భీష్మించుకుని కూర్చుంటుంది సత్య. దేవుడమ్మ ఎంత చెప్పినా వినదు. అక్కడ ఆదిత్య, రుక్మిణిలు గతాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతారు. ఎవరో పాప కనిపిస్తే దేవేనని పరుగెత్తుకుంటూ వెళ్తుంది రుక్కు. ఆ తర్వాత అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవి కనిపించకపోవడంతో అల్లాడిపోతారు రుక్మిణి, ఆదిత్యలు. ఇంటి దగ్గర అమ్మ కూడా టెన్షన్ పడుతుంటుంది. సొంత మనమరాలిలా భావిస్తుంది అంటాడు ఆదిత్య. ఈసారి దేవిని ఎలాగైనా నీతో పంపిస్తానని మాటిస్తుంది రుక్కు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మళ్లీ దేవిని వెతకడానికి బయల్దేరతారు. దేవి కోసం జానకి తిండి తినకుండా ఏడుస్తుంది. అంతలోనే దేవుడమ్మ భర్తతో కలిసి వస్తుంది. జానకి, రామ్మూర్తిలను ఓదారుస్తారు. దేవి గురించి అడిగి తెలుసుకుంటుంది. అసలు దేవి ఇంట్లో నుంచి వెళ్లిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా? అని అనుమానం వ్యక్తం చేస్తుంది. అపుడే చిన్మయి వచ్చి అవ్వా.. అని పట్టుకుని ఏడుస్తుంది. చెల్లి నువ్ కలిసే వస్తారు కదా.. నీకు తెలియదా అని అడుగుతాడు ఈశ్వర ప్రసాద్. మాధవ్‌ని చూసి దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. వీడిలో ఎలాంటి బెంగ లేదేంటి అనుకుంటుంది. రాధ ఏది అని అడగ్గా.. దేవిని వెతికేందుకు బయల్దేరిందని చెప్తాడు రామ్మూర్తి. ‘జానకమ్మ గారు. మీ ఆరోగ్యం బాలేద. మీరు కంగారు పడకండి. దేవి క్షేమంగా తిరిగి వస్తుంది’ అని ధైర్యం చెప్పి వెళ్లిపోతుంది దేవుడమ్మ.
‘చిన్మయి ఉదయం నువ్వు దేవి కలిసే వెళ్లారు కదా. దేవి ఎందుక వచ్చింది’ అని అడుగుతాడు మాధవ్. తెలియదు నాన్నా.. తెలిస్తే నేనెందుకు రానిస్తాను అంటుంది చిన్మయి. బాధపడుతున్న కూతురితో చెల్లిని ఎలాగైనా వెతికి తీసుకువస్తానంటాడు మాధవ్. ఆ తర్వాత పేపర్ ప్రకటనలో చూసిన వ్యక్తికి భోజనం పెడతాడు సూరి, భాషాలు. ఉన్నదంతా కుమ్మేస్తాడు అతడు. నీ వివరాలు చెప్తే మీ నాన్న 50 లక్షలు ఇస్తానన్నాడు అంటారు అతనితో. మీరు చాలా అమాయకులు. మా నాన్నతో కిడ్నాప్ చేశామని చెప్తే 2 కోట్లు ఇచ్చేవాడని అంటాడు ఆ వ్యక్తి. ఇలా చెప్తే నీకు లాభమేంటని బాషా అడగ్గా.. ముగ్గురం కలిసి పంచుకోవచ్చని అంటాడు అతడు. అది గొర్రెల్లా నమ్ముతారు బాషా, సూరిలు. పట్టుకున్న ఆ వ్యక్తికి మళ్లీ ఫోన్ చేసి మాట్లాడతారు.
ఆ తర్వాత సీన్‌లో మాధవ్ తన అక్క గురించి చెప్పిన అబద్ధాల్ని నమ్మి బాధపడుతుంది సత్య. నా బతుకేంటి ఇలా అయిపోయింది. ఇంత చదువు చదివి.. నా భర్త వేరే వాళ్లతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవడమేంటి? అని అనుకుంటుంది మనసులో. అంతలోనే మాధవ్ ఇంటికి వెళ్లి వస్తున్న అత్త, మామలు కనిపిస్తారు. ‘ఏమండి. మీరు గమనించారా. పాప కనిపించట్లేదన్న బాధ ఆ మాధవ్ ముఖంలో ఏ మాత్రం లేదు’ అంటుంది భర్తతో. నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉందంటాడు ఈశ్వరప్రసాద్. ఆదిత్య లాంటి వాడే ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. పైగా కన్నతండ్రి వాడు. ఆ మాధవ్ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది దేవుడమ్మ. పాపని వెతుకుతూ బయట ఉండాల్సిన వాడు ఇంట్లోనే ఉన్నాడేంటని అనుమానం వ్యక్తం చేస్తాడు ఈశ్వర ప్రసాద్. బాధ్యతలేని వాడికి పిల్లలెందుకని కోప్పడుతుంది దేవుడమ్మ. రాధ నిన్నటి నుంచి వెతుకుతుండగా.. మాధవ్ మాత్రం ఇల్లు కదలట్లేదని కోపంతో ఊగిపోతుంది దేవుడమ్మ. ఇదంతా చాటుగా గమనించిన సత్య వాళ్లు కలిసి తిరుగుతున్నారని అసూయ పడుతుంది.
అక్కడ ఆదిత్య, రాధలు దేవిని వెతికే పనిలో ఉంటారు. ఇంత వెతికినా దేవి కనిపించట్లదేంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అనుమానిస్తాడు ఆదిత్య. నువ్ ఆఫీసర్‌వి కదా ఎవరితోనైనా వెతికించు అంటుంది రుక్కు. ఆ మాటలకు భార్య మీద అరుస్తాడు ఆదిత్య. నువ్ చేసిన తప్పుకు ఎవర్ని ఏమన్నా ఏం తప్పులేదంటూ మండిపడతాడు. అదే నా బిడ్డ నా దగ్గర ఉంటే ఏ కష్టం రాకుండా చూసుకునే దాన్నంటూ ఎమోషనల్ అవుతాడు. అసలు దేవి కనిపించకపోవడానికి కారణం ఆ మాధవేనని నాకు అనుమానంగా ఉందంటాడు ఆదిత్య. ఇంతకీ దేవి ఏమైంది? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..