వేదని మోసం చేస్తునందుకు యశోధర్ తనలో తానే బాధపడుతుంటాడు. ఆ కోపంలో ఖుషి మీద అరుస్తాడు. అలిగిన ఖుషిని వేద బుజ్జగిస్తుంది. ఆ తర్వాత ముగ్గురు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. ఆ తర్వాత యశోధర్ వేదకు నిజం చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో చూద్దాం..
నిద్రలో ఉన్న వేద భర్త మాటల్ని తలుచుకుంటుంది. మెళకువ వచ్చి చూస్తే బెడ్ మీద యశోధర్ కనిపించడు. అటు యశోధర్ మాళవికతో మాట్లాడుతుంటాడు. అన్ని రకాలుగా నిన్ను కాపాడతానని మాటిస్తాడు. వేద దగ్గర నిజం చెప్పేస్తానని మాళవికతో అంటాడు. కానీ మాళవిక వద్దంటుంది. వేద నా భార్య.. చీట్ చేయనంటాడు యశోధర్. ఎన్ని చెప్పినా మాళవిక ఒప్పుకోదు. జాగ్రత్తపడమంటూ హెచ్చరిస్తుంది. ఇది నీ కొడుకు లైఫ్‌కి సంబంధించిన విషయం అని గుర్తుచేస్తుంది. అంతలోనే బయట నిల్చున్న వేదని చూసి యశోధర్ ఆఫీస్ వ్యక్తితో మాట్లాడినట్లు నటిస్తాడు. వేదకి కూడా ఆఫీస్ కాల్ అని చెప్పి కవర్ చేసుకుంటాడు. ఫోన్ అక్కడే పెట్టి లోపలికి వెళ్తాడు యశ్. అపుడే మాళవిక నుంచి యశోధర్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి వేద కుప్పకూలుతుంది. అసలేం జరుగుతుంది. ఈయన ఫోన్ మాట్లాడింది మాళవికతోనా. వసంత్‌తో అని నాకు అబద్ధం ఎందుకు చెప్పారు అంటూ ఆలోచిస్తుంది. అక్కడ లోపలికి వెళ్లిన యశోధర్ వేదకు అబద్ధం చెప్పానని ఫీల్ అవుతాడు. తప్పు చేస్తున్నానని గిల్టీగా ఫీలవుతాడు.
మరుసటి రోజు ఉదయం మాళవిక గతంలో యశోధర్ తెచ్చిన డ్రెస్ తాలూకు జ్ఞాపకాల్ని తలుచుకుంటుంది. అప్పుడు తనకోసం ఏరికోరి తీసుకువచ్చిన డ్రెస్, గాజులు, జుమ్కాలను అల్మారి నుంచి తీసుకుంటుంది. నీకు ఇష్టమైన ఈ డ్రెస్ ఇప్పటికీ మర్చిపోలేదనుకుంటా యశోధర్. మళ్లీ గతం గుర్తు చేస్తా. నా అందం చూసి నీకు పిచ్చెక్కి పోవాలి. ఐయామ్ సారీ యశోధర్. నా దగ్గర అందానికి మించిన ఆయధం లేదు. నీ లైఫ్‌లో నా తర్వాతే దాని స్థానమని ఆ సూర్పణకు తెలియాలని వేదని మనసులో తిట్టుకుంటుంది. ఆ తర్వాత సీన్‌లో పడుకున్న వేదని నిద్ర లేపుతుంది ఖుషీ. అమ్మని పడుకోనీయమ్మ లేపద్దు అంటాడు యశోధర్. నేను స్కూల్‌కు వెళ్లాలి డాడీ. అమ్మ లేకుండా ఎలా రెడీ అవ్వాలి అంటుంది తండ్రితో. నేను రెడీ చేస్తానంటాడు యశోధర్.
పడుకున్న వేదతో ‘నువ్ ఇలా పడుకుంటేనే బాగుంది వేద. నువ్ మెలుకువగా ఉండి ఇంట్లో తిరుగుతుంటే నిన్ను ఫేస్ చేయలేను వేద. నీకు మొహం చూపించలేను. నామీద నువ్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకున్నాను. అత్తయ్యకిచ్చిన మాట తప్పాను. నిన్ను క్షమించమని కూడా అడగలేను. కానీ ఏం చేయను. తప్పట్లేదు. ఆది కోసం ఇదంతా చేయక తప్పడంలేదు అనుకుంటాడు మనసులో. అంతలోనే ఖుషీ వచ్చి మాట్లాడుతుంటే అమ్మ లేస్తుంది మెల్లగా అంటాడు. ఖుషీని స్కూల్‌కి రెడీ చేస్తాడు యశ్. మాళిని కొడుకును, మనవరాలిని అలా చూసి ముచ్చటపడిపోతుంది.
ఆ తర్వాత సీన్లో మాళవిక అందంగా ముస్తాబవుతుంది. అది చూసి అభిమన్యు తనని పొగడుతాడు. ఎందుకు ఇంత అందంగా తయారయ్యావు బంగారం. యు ఆర్ లుక్కింగ్ స్టన్నింగ్ టుడే అంటూ మాళవికని ఆకాశానికి ఎత్తుతాడు. ఏంటి ఈ రోజు స్పెషల్. నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అంటాడు అభిమన్యు. నాకు ఎప్పటికి వెగటు పుట్టని స్వీట్‌వి నువ్. ఈ రోజంతా నాతోనే ఉండాలి నువ్ అంటాడు మాళవికతో. ఏంటి అభి. ఈరోజు ఆది స్కూల్ రీఓపెనింగ్ డే. నీకైతే ఈలాంటివి ఎలాగు పట్టవు. నేనంటే వాడి తల్లిని కదా అంటుంది అభితో. సరే ఇద్దరం కలిసి వెళ్లి ఆదిని స్కూల్లో డ్రాప్ చేద్దాం. ఆ తర్వాత ఏదైనా హోటల్లో గడుపుదామని అడుగుతాడు మాళవికని. ఫస్ట్ నన్ను స్కూల్‌కి వెళ్లనివ్వు అని తప్పించుకుని వెళ్తుంది మాళవిక. అభికి మాళవిక ప్రవర్తన మీద కొంచెం డౌట్ వస్తుంది.
ఆ తర్వాత సీన్‌లో యశోధర్ ఖుషీని తీసుకెళ్లి స్కూల్ దగ్గర దింపుతాడు. దింపి కారు దగ్గరికి వెళ్లిన తండ్రిని పిలిచి.. నాన్నా నువ్ అమ్మని ఏమైనా అన్నావా అని అడుగుతుంది. అదేం లేదమ్మా అని చెప్పగా అమ్మ ఎప్పుడూ ఇంత ఆలస్యంగా నిద్రలేవదు. ఏదో అప్‌సెట్ అయినట్టుంది. మమ్మీని ఏం అనద్దు నాన్నా. మమ్మీ ఫీలైతే నేను కూడా ఫీలవుతా. నేనంటే వేదమ్మకు బోలెడు ఇష్టం. నన్ను ఎలా చూసుకుంటావో వేదమ్మని కూడా అలానే చూసుకో. మమ్మీకి ఇష్టం లేని పనిచేయొద్దు నాన్నా అంటూ మాటతీసుకుంటుంది ఖుషీ. ఆ తర్వాత సీన్లో మాళవిక కూడా స్కూల్‌కి వస్తుంది. మరి అక్కడేం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..