తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 షో ప్రస్తుతం ఆసక్తికరంగా నడుస్తుంది. ప్రతి సీజన్ లో లవ్ స్టోరీలు కామన్ గా బిగ్ బాస్ లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ లవ్ ట్రాక్ బాగా నడిచింది. అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యకి దగ్గరవుతూ తన ప్రేమని చూపించే ప్రయత్నం చేసేవాడు. అతను ఆటమీద కంటే శ్రీసత్యతో లవ్ ట్రాక్ నడపడం మీదనే ఎక్కువగా దృష్టిపెట్టాడు అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. బిగ్ బాస్ టీమ్ అతన్ని సేఫ్ చేస్తూ వస్తుందనే టాక్ కూడా నడిచింది. డేంజర్ జోన్ లోకి వచ్చిన అర్జున్ కళ్యాణ్ సేఫ్ అవుతూ ఉండటమే దీనికి కారణం. ఇక ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసాడు.
అతని ఎలిమినేషన్ ఎవరికి సర్ప్రైజ్ అనిపించలేదు. కానీ బయటకి వచ్చాక అర్జున్ కళ్యాణ్ రివీల్ చేసిన విషయం అందరికి సర్ప్రైజ్ అనిపించింది. స్టేజ్ మీద నాగార్జున ముందు అర్జున్ శ్రీసత్య మీద తనకున్న ఇష్టాన్ని తెలియజేశాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కారణం శ్రీసత్య అని తెలిపాడు. తన సినిమాకి సంబంధించి ఆడిషన్ కోసం వచ్చిన హీరోయిన్స్ జాబితాలో శ్రీ సత్య ఫోటో చూసినపుడు ఆమెని ఎంపిక చేయాలని అనుకున్నాం. అయితే తాను బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తుందని తెలిసింది. దీంతో నేను కూడా ఎలా అయిన బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలా ప్రయత్నిస్తే అవకాశం వచ్చింది.
ఇక హౌస్ లోకి వచ్చింది కూడా నా ప్రేమ విషయాన్ని శ్రీ సత్యకి తెలియజేయడానికే అనే విషయాన్ని అర్జున్ చెప్పాడు. స్టేజ్ మీదనే ఈ విషయాన్ని ఆమెతో చెప్పాలని ఇంత వరకు వెయిట్ చేసాను. ఈ మాట విన్న తర్వాత శ్రీ సత్య చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యింది. తనకి కూడా ఈ విషయం చెప్పలేదని చెప్పింది. అలాగే హౌస్ లో ఉన్న అందరూ కూడా అర్జున్ కళ్యాణ్ మాట విన్న తర్వాత సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇక బయటకి వచ్చాక మీడియాతో మాట్లాడుతూ కూడా అర్జున్ కళ్యాణ్ అదే విషయాన్ని చెప్పడం విశేషం. కేవలం శ్రీ సత్య మీద ఉన్న ప్రేమని ఆమెకి చెప్పడానికే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేశానని అర్జున్ కళ్యాణ్ ఎవరికి చెప్పని సీక్రెట్ రివీల్ చేసాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఆడియన్స్ కి కూడా చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. మరి బయటకి వచ్చాక శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ ప్రేమని అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి.