Karnataka Minister: రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఓ మంత్రి.. సాయం చేయాలంటూ వచ్చిన మహిళ మీద చేయి చేసుకోవడం సంచలనం రేపింది. తమ గోడును వెల్లబోసుకోవడానికి మంత్రి వద్దకు వస్తే, విసిగిపోయిన మంత్రి ఏకంగా మహిళ చెంప చెల్లుమనిపించడం, సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగాయి. సర్వత్రా మంత్రి మీద విమర్శలు వస్తుండగా.. ఇంతకీ ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందాం.
కర్ణాటకలోని చామారాజనగర జిల్లా హంగాల గ్రామంలో భూపట్టాల పంపిణీ కార్యక్రమానికి.. ఈ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సోమన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూక్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్ 94సీ ప్రకారం టైటిల్ డీడ్ లను అందించారు. ఈ క్రమంలో మంత్రి వద్దకు ఓ మహిళ తన మొర వినిపించేందుకు వచ్చింది.
తనకు కూడా ప్లాట్ కేటాయించాలని సదరు మహిళ మంత్రిని వేడుకుంది. తాను దరఖాస్తు చేసుకున్నా రెవిన్యూ శాఖ పట్టాను మాత్రం ఇవ్వలేదని ఆమె మంత్రితో వాదనకు దిగింది. తనకు కూడా ప్లాట్ కేటాయించాలని కోరింది. అయిితే ఓ సందర్భవలో ఆమె మంత్రి మీదకు ఎగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి సదరు మహిళ చెంప చెల్లుమనిపించాడు.
Karnataka Minister:
దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మంత్రి సోమన్న కాళ్లకు దండం పెట్టి ఆ మహిళ తన గోడును చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే మంత్రి కార్యాలయం మాత్రం మరో వీడియోను విడుదల చేసి.. అందులో మహిళ తనకు ప్లాట్ కేటాయించాలని మాత్రమే అభ్యర్థిస్తున్న విషయం మాత్రమే ఉంది. మొత్తానికి మంత్రి సోమన్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
बेहद शर्मनाक! जिस जनता से हाथ जोड़कर वोट मांगते हो उसी जनता पर हाथ उठा रहे हो? कर्नाटक के इस मंत्री के ख़िलाफ़ सख्त एक्शन होना चाहिए। pic.twitter.com/bI1v5Cbl4l
— Swati Maliwal (@SwatiJaiHind) October 23, 2022