Flax Seeds Benefits: అవిస గింజల గురించి చాలా మందికి సుపరిచితమే. మలబద్ధకం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. మనం తినే ఆహారంలో జీర్ణం కాని వాటి సంఖ్య పెరిగిపోతే మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది. కడుపులో చెత్త పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు అటాక్ చేస్తాయి. అందుకే వీలైనంత వరకు ఈ సమస్య నుంచి బయట పడటానికి ప్రయత్నించాలి. మలబద్ధకం నివారణకు అవిస గింజలు పరమౌషధంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలకు నెలవు అవిస..
అవిస గింజల్లో చాలా రకాల పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇవి మనిషి శరీరంలోని మలబద్ధకం అనే సమస్యను పారదోలుతాయి. అంతేకాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి కూడా మనల్ని కాపాడతాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కడుపులోని పేగులను శుభ్రపరుస్తుంది.
అవిస గింజల్లో ప్రొటీన్, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, పొటాషియం లాంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ప్రతి రోజూ అవిస గింజల్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ నిత్యనూతనంగా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, కడుపులో మంట, తిమ్మిర్లు, కడుపునొప్పి లాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే అవిస గింజలు బాగా పని చేస్తాయి.
Flax Seeds Benefits:
కాసిన్ని వేయించిన అవిస గింజలు రోజూ తింటే మలబద్ధకం ఇట్టే మాయమైపోతుంది. వాటిని పొడి చేసి, గోరు వెచ్చిని నీళ్లలో కలిపి కూడా తాగవచ్చు. సలాడ్లు, కూరగాయలు, సూప్, స్మూతీస్ లో కూడా కలిపి తినొచ్చు. అయితే, ఇక్కడ ఓ హెచ్చరిక కూడా ఉంది. అవిస గింజలు మన శరీరానికి వేడి చేస్తాయి. కాబట్టి ఎండా కాలంలో కాస్త చూసుకొని వాడాలి. రోజూ తినమన్నారు కదా అని.. వేసవి కాలం లాగించేస్తే అధిక వేడి సమస్య వస్తుంది. అందుకే కాస్త వైద్యులను సంప్రదించి వీటిని వాడితే మంచిది.