Viral Dance Video: ఎవరిలోనైనా కదలికలు తెచ్చేది డ్యాన్స్. కాస్త మంచి బీట్ ఉంటే చాలు మనలో చాలామంది.. తెలియకుండానే కాలు కదుపుతూ ఉంటారు. ఇక డ్యాన్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు మంచి పాట వినబడితే చాలు ఎక్కడ అయినా కుమ్మేస్తుంటారు.
అయితే డ్యాన్స్ వేయడానికి ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ ఏమీ ఉండదని అందరికీ తెలుసు. రోడ్డు మీద, క్లాసులో, హోటల్ లో, బస్టాండ్ లో ఇలా ఎక్కడపడితే అక్కడ స్టెప్పులు వేస్తూ చాలామంది అదరగొడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం చాలా వెరైటీ ఒక వస్తువు మీద స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు అతడు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.
మనలో చాలామంది ట్రెడ్ మిల్ ని వాడకపోయినా.. దాని గురించి మాత్రం తెలిసే ఉంటుంది. మామూలుగా బరువు తగ్గడానికి, ఎక్సర్ సైజ్ కోసం ఇంట్లో లేదంటే గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసుకునే జిమ్ ఐటెం ఇది. ఇలాంటి ట్రెడ్ మిల్ మీద ఓ వ్యక్తి బాలీవుడ్ పాటకు అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
Viral Dance Video:
అలోక్ శర్మ అనే కుర్రాడు ట్రెడ్ మిల్ మీద హిందీ సినిమా ‘కబి ఖుషి కబి ఘమ్’ సినిమాలోని ఫేమస్ పాటకు స్టెప్పులేశాడు. లిరిక్స్ కు తగ్గట్టుగా ఆ కుర్రాడు ఎంతో అద్భుతంగా స్టెప్పులు వేయగా.. అతడికి ఎక్కడా తడబాటు కనిపించలేదు. దీంతో ట్రెడ్ మిల్ మీద ఇంత ఈజీగా స్టెప్పులు లేశాడేంటి అని అందరూ అతడి వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సదరు వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది.
https://www.youtube.com/shorts/hPTVxBuuMFU