Shruthi Haasan: శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం శృతిహాసన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హీరోయిన్ గా తన కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
అయితే మొదట్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన శృతిహాసన్ ఆ తర్వాత కొద్దికాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయింది. గత ఏడాది మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందీ.
కాగా ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డి , చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తోంది. ఈమె కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. శృతిహాసన్ మూడు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ తన అందంతో యువతకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో శృతిహాసన్ ఒక చేతిలో కాకరపువ్వొత్తిని వెలిగిస్తూ ముద్దు పెడుతోంది. ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ హ్యాపీ దీవాలి అనే క్యాప్షన్ కూడా రాసుకోచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోని చూసిన అభిమానులు ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.