Amith Shah : ఏపీ పాలిటిక్స్ రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఇటీవల విశాఖ ఘటన నుంచి ఏం జరిగినా హాట్ టాపిక్ అవుతోంది. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు అమిత్ షాకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. పవన్ హిందీలో అమిత్ షాకు బర్త్ డే విశెష్ తెలియజేస్తూ ట్వీట్ పెట్టారు. దీనికి అమిత్ షా తెలుగులో ధన్యవాదాలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.
పవన్ ట్వీట్‌కు బదులిచ్చిన అమిత్ షా.. ‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు’ అని కామెంట్ పెట్టారు. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. ఒక రకంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టుగానే మాట్లాడారు. బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదంటూ ఆయన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ పరిణామాలన్నీ తెలుసుకున్న కేంద్రం.. పవన్‌ను ఢిల్లీకి పిలిపించిందన్న వార్తలూ వినవచ్చాయి. అయితే ఇటీవల మీడియా పవన్‌ను.. మీరు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తారా..? అని పవన్ కళ్యాణ్‌ను మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఆయన కలవబోనని.. ఇక్కడే తేల్చుకుంటానని చెప్పారు.
ఇక పవన్‌తో పాటు ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ట్వీట్‌కు బదులిచ్చిన అమిత్ షా.. చంద్రబాబు ట్వీట్‌ను మాత్రం అసలు పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుని టీడీపీతో కలిసి నడిచేందుకు సన్నద్ధమయ్యారు. మరోవైపు ఈ రెండు పార్టీలతో బీజేపీ సైతం కలిసి నడవొచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అమిత్ షా ఎందుకు చంద్రబాబు ట్వీట్‌ను పట్టించుకోలేదనేది ఆసక్తికరంగా మారింది.
Wishing Hon’ble Union Home Minister @AmitShah Ji a very happy birthday. May he be blessed with a long and healthy life.
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2022
Thank you so much @ysjagan Ji. https://t.co/7zRcKLPRTW
— Amit Shah (@AmitShah) October 22, 2022
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. @PawanKalyan https://t.co/yCD69lrtM5
— Amit Shah (@AmitShah) October 22, 2022