Relation: పెళ్లి మనిషి జీవితంలో ఒక మధుర ఘట్టం. అయితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెళ్ళికి ముందు ఉండే ప్రపంచం వేరు.. పెళ్లి తర్వాత మారే ప్రపంచం వేరు పెళ్లయిన తర్వాత ఏ వ్యక్తి జీవితంలోనైనా చాల మార్పులు వస్తాయి. అయితే అబ్బాయితో పోలిస్తే అమ్మాయిల జీవితంలో వచ్చే మార్పులు చాల ఎక్కువ. బహుశా ఇందుకేనేమో అమ్మాయిలు పెళ్లి సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉంటారు.
అయితే ఈ మధ్య అమ్మాయిల పెళ్ళికి ముందు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఇంతకు అది ఏమై ఉంటుందని అనుకుంటున్నారు..? “అమ్మాయిలు పెళ్లికి ముందు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారని”. అవునండీ.. ఇక అబ్బాయిలు ఈ విషయంపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తమకు కాబోయే అమ్మాయి కూడా ఏం వెతుకుతుందో తెలుసుకోవాలి అనుకుంటారుగా!!
ఇక అసలు విషయానికొస్తే..
*అమ్మాయిలు పెళ్ళికి ముందు ఎక్కువగా బట్టల కోసం వెతుకుతారట. అందులోను పెళ్ళికి తర్వాత ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలి అని ఎక్కువగా గూగుల్ చేస్తారట.
*అలాగే పెళ్లికి సరైన వయస్సు ఏది? అని ఎక్కువ మంది ఆడవాళ్లు గూగుల్ ని అడుగుతారట.
* వినడానికి నవ్వు తెప్పించేలా ఉన్నా.. పెళ్లయ్యాక అత్తవారింట్లో ఎలా ఉంటుంది అని కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారట అమ్మాయిలు.
*మరికొంత మంది పెళ్లి తర్వాత భర్తను ఎలా సంతోషపెట్టాలి, అత్తమామలకు ఎలా సేవ చేయాలి? అని కూడా గాలిస్తున్నారట.
Relation:
ముఖ్యంగా అమ్మాయిల్లో పెళ్లి అనగానే కొన్ని అంశాల్లో భయం ఉంటుంది. అందుకే ఆ భయాలను, అనుమానాలను, సందేహాలను తెలిసిన వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా నివృత్తి చేసుకుంటారు. అయితే కొంత మంది ఆడవాళ్లు ఇతరులను అడగానికి ఇబ్బంది పడడం వల్ల.. అలాంటి విషయాలను ఇలా మొహమాటం లేకుండా గూగుల్ ని అడిగేస్తుంటారట..!