Diwali: దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇంకా చెప్పాలంటే లక్ష్మి పూజలు జరుపుకునేది ఈ దీపావళికే కదా. కానీ ఇదే సమయంలో డబ్బులు కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెడుతుంటాం. ఇక పండుగల సమయంలో మనం అసలు రాజీ పడం కదా. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం అని డైలాగులు కూడా కొట్టేస్తాం. అలా డబ్బుని బడ్జెట్ కి మించి ఖర్చు పెట్టేస్తుంటాం. ఇక ఇలాంటి సమయంలో బడ్జెట్ దాటకుండా మనం జాగ్రత్త పడాలి. అలాంటి జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ మాత్రం అసలు దాటొద్దు:
ఇక పండుగల సమయంలో బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించం. అప్పు చేయడానికి కూడా వెనుకాడరు. నిజం చెప్పాలంటే మనకు ఉన్నంతలో పండగ చేసుకోవడం చాలా ఉత్తమం. దీనికి సంబంధించి మనకు ముందుగానే ఒక ప్రణాళిక ఉండాలి. ఎలా అంటే ఒక వేళ మన బడ్జెట్ 15000 అనుకుందాం. ఇక ఆ 15000 లకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వాడొద్దు. ఖచ్చితంగా ఈ విషయంలో మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి.
కార్డులు మరియు ఆన్లైన్ పేమెంట్ల జోలికి వెళ్ళకండి:
కార్డులు మాత్రం అసలు వాడకండి. ఎందుకంటే చేతిలో నగదు ఉంటె ఉన్నంత వరకే ఖర్చు పెట్టొచ్చు. ఇక కార్డులంటే మన జేబులోంచి వెళ్లకున్నా అకౌంట్లో నుంచి వెళ్లిపోతుంటాయి కాబట్టి మనం వాటి గురించి అసలు పట్టించుకోము. ఇంకా ఎక్కడ పడితే అక్కడ గూగుల్ పే ఫోన్ పే లాంటి డిజిటల్ పేమెంట్ లు వాడి డబ్బును వృధా చేస్తూ ఉంటాం. కాబట్టి చేతిలో డబ్బులు అయిపోయినా సరే ఇలాంటి డిజిటల్ పేమెంట్ల జోలికి వెళ్ళకూడదు.
Diwali: డిస్కౌంట్ ల గురించి తెలుసుకోండి:
ఇక షాపింగ్ చేసే సమయంలో కూడా జాగ్రత్త పడండి. నిజం చెప్పాలంటే పండుగ అంటే డిస్కౌంట్ లతో వివిధ షాపింగ్ మాల్స్ మరియు ఆన్లైన్ పోర్టల్స్ ఊరిస్తూ ఉంటాయి. అయితే వాటిలో కూడా ఎక్కువ డిస్కౌంట్ ఎలా వస్తుందో చూసుకుని షాపింగ్ చేస్తే మనకు డబ్బు చాలా ఆదా అవుతుంది. అలాగే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకు అత్యంత అవసరమైన వాటిని మాత్రమే తీసుకోండి.