Love Relationship: ఎవరితోనైనా లవ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి, చెడు సందర్బాల్లో ఎప్పుడూ బంధాన్ని కాపాడుకోవడం అంత తేలికైన విషయం కాదు. మీపై మీ భాగస్వామి మనసులో భావాలను, నమ్మకాన్ని బలోపేతం చేయాలి. అందుకు చాలామంది వివిధ పద్ధతులను పాటిస్తారు. అయితే, కొన్ని బహిరంగ ప్రశ్నల సాయంతో మీపై పారదర్శకతను కనుక్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసా..?
బంధంలో ఇద్దరూ ప్రేమపూర్వకంగా మెలిగినప్పుడే అది దృఢంగా తయారవుతుంది. మీ భాగస్వామి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఆపద సమయాల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. వారి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఈ సందర్భంలోనే వారికి మీపై శ్రద్ధ కలిగేటట్లు చేస్తాయి. అలాంటి ప్రశ్నలు వేయడం వల్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా వారి మనసులో నిలిచిపోతారు.
బంధంలో ఏది బాగా ఇష్టం ఉంటుందో భాగస్వామిని కనుక్కోవాలి. తద్వారా వారి ఇష్టాలకు మీరు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతం పంపుతారు. ఇలాంటి ప్రశ్నల ద్వారా మంచి అనుభూతి చెందే ఆస్కారం ఉంటుంది. వీటికి వచ్చే సమాధానాలు మిమ్మల్ని మరింత సంతృప్తికర జీవితాన్ని గడిపేలా చేస్తాయి.
Love Relationship
మరో ముఖ్యమైన ప్రశ్న.. భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఇది అడగాలి. భాగస్వామి ఆనందానికి ఏం చేయాలో, ఏది చేస్తే ఆనందిస్తారో కనుక్కోండి. కలిసి ఉన్నప్పుడు ఏం చేయడానికి వారు ఇష్టపడతారో తెలుస్తుంది. దీంతో అపార్థాలకు తావు లేకుండా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అత్యంత సరదా క్షణాలు, మధుర ఘట్టాల సమయంలోనూ మీరు వారికి తోడుగా ఉంటామనే సంకేతాలు ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఫలానా అంశంలో నీకు సాయం చేయనా? అని అడుగుతూ ఉండాలి. తద్వారా మీపై వారికి శ్రద్ధ పెరుగుతుంది.