NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశం మొత్తం మారుమోగేలా సక్సెస్ సాధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అయితే తరువాత చేసే సినిమా విషయం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించేందుకు ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందే కమిటయ్యాడు. అయితే ఈ సినిమా నుండి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశలో ఉన్నారు.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిందనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు రాకపోవడంతో చాలా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మూవీ కథ ఎన్టీఆర్‌కు అంతగా నచ్చలేదని, ఈ కథలో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నారని విన్నాం. అంతేకాదు ఈ సినిమాను ఎన్టీఆర్ పూర్తిగా పక్కనపెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా నుండి ఒక అప్‌డేట్ రానుంది. ఈ దీపావళికి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్‌టిఆర్30 అనే వర్కింగ్ టైటిల్‌తో పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పుడు ఏం టైటిల్ పెట్టారనే విషయంపై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు.
NTR:
ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర హీరోయిన్‌ను మర్చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రధాన్యత ఉండడంతో ఆ విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. నిజానికి ఈ సినిమాలో మొదట అలియాబట్ హీరోయిన్‌గా అనుకున్నారు. కాని ఆమె ప్రెగ్నెంట్ కావటం వలన ఆమె ఈ సినిమా నుండి తప్పకున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో మరో బ్యూటీ కోసం వెతుకులాట ప్రారంభించిన కొరటాల రష్మిక మంథానాను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సంపాదించుకుంది. అందుకే ఈ సినిమపై భారీ అంచనాలు ఉన్నాయి.