Cameron Green: చాలా ఏళ్లుగా ఆస్ట్రేలియా జట్టు T20ల్లో రాణిస్తూ ఉంది. ఏ జట్టునైన తమ బ్యాటింగ్, బౌలింగ్ తో బెదరగొడుతుంది. మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ నుండి నేటి కెప్టెన్ ఆరోన్ ఫించ్ వరకూ ఆస్ట్రేలియా జట్టును నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి జట్టులోకి రావాలి అంటే ఆటగాళ్లు ఎంతగానో శ్రమ పడాల్సి వస్తుంది. కానీ ఈ క్రికెటర్ మాత్రం ఒకే ఒక్క సిరీస్ తో ఆకట్టుకుని వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను ఎవరో కాదు ఇండియాతో సీరీస్ లో అదరగొట్టిన T20 హిట్టర్ కామెరూన్ గ్రీన్.
ఆస్ట్రేలియా జట్టు ఆల్ రౌండర్లతో నిండిపోయింది. మ్యాక్స్ వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్ ల రూపంలో జట్టులో చాలా మంది ఆల్ రౌండర్లు ఉన్నారు. ఏ జట్టులోనూ ఇంతమంది ఆల్ రౌండర్లు లేరు. వీరికి తోడుగా ఇప్పుడు కామెరూన్ గ్రీన్ కూడా తోడయ్యాడు. మూడు వారాల ముందు ఇండియాలో ఇండియాతో జరిగిన మూడు టీ20లో సీరీస్ లో అదరగొట్టాడు. మూడు మ్యాచుల్లో కలిపి 118 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్ లో కూడా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు.
వరల్డ్ కప్ ముందు ఏడు టి20 లు మాత్రమే ఆడిన కామెరూన్ గ్రీన్ ను ఆస్ట్రేలియా జట్టు ఏ విధంగా ఉపయోగిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్ లో గ్రీన్ ను ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కామెరూన్ గ్రీన్ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. ఇండియాపై అదరగొట్టిన గ్రీన్ ను వార్నర్ కు తోడుగా ఓపెనింగ్ కు పంపించే అవకాశం ఉంది. దీంతో ఫించ్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
Cameron Green:
ఆస్ట్రేలియా క్రికెటర్ జాస్ ఇంగ్లీస్ గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్ ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టుకు ఎంపిక చేసింది. ఇండియాతో సీరీస్ లో మెరుగైన ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ ఆశించిన మేర రాణిస్తే ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించగలడు.