Rohit Sharma: ఎన్నో అంచనాల మధ్య ఇండియా జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. ఆస్ట్రేలియా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అన్ని జట్ల కంటే ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకున్నది. అందుకు అనుగుణంగానే వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడింది. దాని తర్వాత వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ లలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొన్నది. ఇప్పుడు అందరి కళ్ళు రోహిత్ శర్మ కెప్టెన్సీ పైనే ఉన్నాయి.
అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా జట్టును నడిపించడంలో రోహిత్ శర్మ తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఫుల్ టైం కెప్టెన్ గా జట్టును నడిపించిన రోహిత్ శర్మ ప్రతి సిరీస్ లో ఇండియాకు టైటిల్ ని అందించాడు. ఈ మధ్య జరిగిన ఒక్క ఆసియా కప్ లో మాత్రమే రోహిత్ శర్మ కెప్టెన్సీలో నిరాశపరిచాడు. ఐపీఎల్ లో తిరుగులేని రికార్డు ఉన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఏకంగా ఐదు టైటిళ్లను అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
2007లో ఇండియా ఆడిన తొలి వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లో ఇండియా జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ 15 ఏళ్ల కెరీర్లో 100 T20 మ్యాచులకు పైగా ఆడిన అనుభవం రోహిత్ శర్మకు ఉంది. వీటిలో సుమారు 40 మ్యాచులకు పైగా జట్టును కెప్టెన్ గా నడిపించాడు. వీటిలో 80% పైగా విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డులను చూసే క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మకు వరల్డ్ కప్ టైటిల్ ను అందించే సత్తా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Rohit Sharma:
సూపర్ -12 పొరులో భాగంగా ఇండియా జట్టు సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై తలపడనుంది. ఈ జట్లపై విజయం సాధిస్తే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. సెమీస్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై తలపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి మ్యాచ్ ఇండియాకు కీలకంగా మారనుంది. ఇది కెప్టెన్ గా రోహిత్ శర్మకు పెద్ద పరీక్షే అవుతుంది. కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాక రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేయలేదు. కనీసం ఈ T20 వరల్డ్ కప్ లో అయినా మెరుగ్గా రాణించి ఇండియాకు టైటిల్ ను అందించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.