Shane Watson: టీమిండియా అక్టోబర్ 23న తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడి వరల్డ్ కప్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. అయితే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారుతుందని తెలిసినా క్రికెట్ అభిమానులు మాత్రం ఈ మాత్రం ఛాన్స్ దొరికిన మ్యాచ్ చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
షేన్ వాట్సన్ మాట్లాడుతూ ఇండియాకు ఒంటి చేత్తో మ్యాచును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు ఉన్నాడని, టీమిండియా ఆ ఆటగాడిని ఎక్కువ మ్యాచులు ఆడిస్తే ఫలితం ఉంటుందని తెలిపాడు. షేన్ వాట్సన్ ఇలా చెబుతున్నాడు అంటే మనం అందరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేదా సూర్య కుమార్ యాదవ్ గురించి చెబుతున్నాడని భావిస్తాం. కానీ వీళ్ళు ఎవరు కాదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకొచ్చాడు. బౌన్సీ పిచ్ లపై హార్దిక్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేయగలడని, అలాగే బ్యాటింగ్లో అదరగొట్టగలడని తెలిపాడు.
ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ప్రతి మ్యాచ్లో నిలకడగా ఆడుతున్నాడు. గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైనా ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టోర్నీ మొత్తంలో అద్బుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ శైలిని మార్చుకొని ప్రధాన బౌలర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు.
Shane Watson:
హార్ధిక్ పాండ్యా ఆస్ట్రేలియా పిచ్ లకు సరిపోయే ఆటగాడని, 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా అతడి సొంతమని, అంతేకాకుండా బ్యాటింగ్ లో భారీ షాట్లు ఆడలగడని షేన్ వాట్సన్ అన్నాడు. సూపర్ -12 పోటీల్లో భాగంగా టీమిండియా సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, B1 జట్లపై ఆడనుంది. ఈ జట్లపై హార్థిక్ పాండ్య ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.