SriDevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ లో షో ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీనికి పోటీగా కూడా ఎన్నో షోలను వేరే ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేసినా కానీ అంత సక్సెస్ సాధించలేకపోయాయి. మొదట ఈ షో ప్రారంభం లో పెద్దగా రేటింగ్ సాధించకపోయినా ఆ తర్వాత సుధీర్ మరియు ఇంద్రజ ఎంట్రీతో షో రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ షోలో ఒక్క అంశానికి ప్రాధాన్యతని ఇవ్వకుండా ప్రతి అంశాన్ని జోడించి పూర్తి ఎంటర్టైన్మెంట్ షోగా రూపొందించారు. అంటే ఈ షోలో డాన్సులు, కామెడీ స్కిట్లు, పంచ్ డైలాగ్లు, పాటలు ఇలా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తారు.
అయితే మొదటగా ఈ షో కి అర్జున్ హోస్ట్ గా వ్యవహరించగా ఆ తర్వాత సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సుధీర్ ఈటీవీ ని వదిలి వేరే ఛానెల్లోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఈ షోని రష్మీ నడిపిస్తోంది. అయితే ఇప్పుడు రష్మీ చేతిలో ఇదొక్క షోనే కాదు. ఈటీవీ షోలన్ని అతన భుజాన వేసుకుని నడిపిస్తుంది. ఒక వైపు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా మూడు షోలని నడిపిస్తోంది. ఇక ఒకప్పుడు ఈటీవీ షో లను ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో అభిమానించేవారు.
కానీ ఈ షోలలో డబల్ మీనింగ్ డైలాగ్ లు ఎక్కువైపోతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ చిరాకు పడుతున్నారు. ఇలా నెగెటివ్ టాక్ వచ్చేసరికి మధ్యలో కొన్ని రోజులు ఆపేసినా మళ్లీయే మొదలెట్టేసారు. అయినా ఇప్పటికి ఆ షాలిని ఆదరించేవారు ఉన్నారు. తిట్టిపొసే వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ షోల వల్ల మాత్రం చాలా మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అయితే దొరికింది.
SriDevi Drama Company:
ఈ కామెడీ షోల తర్వాత స్టార్ట్ అయిన షో శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజం చెప్పాలంటే ఈ షో ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే కనుమరుగు అయిపోయిన ఆర్టిస్టులను మళ్ళీ ఈ షోలోకి తీసుకొస్తున్నారు. అలాగే మన జానపదాలతో పాటు లోకల్ టాలెంట్స్ ని కూడా ఈ షోలో పరిచయం చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఈ షోలోకి కొత్తగా రికార్డింగ్ డాన్సులు వచ్చి చేరాయి. కండక్టర్ ఝాన్సీ చేసిన పల్సర్ బండి పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత కొత్తగా కవిత వచ్చి చేరింది. ఇలా వాళ్ళిద్దరికీ పోటీ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇలా చేయడం వల్ల 20 ఏళ్ళ క్రితం బ్యాన్ అయిన రికార్డింగ్ డాన్సులను మళ్ళీ షోలోకి తీసుకురావడం ఏంటని కొంత మంది విమర్శిస్తున్నారు.