అల్లు అర్జున్ పుష్ప సినిమా తెలుగులో కంటే హిందీలో బాగా హిట్ అయ్యింది. ఒకే రకమైన కథలని చూస్తూ ఉన్న నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి పుష్ప సినిమా సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో జనాలు ఎలా ఉంటారు. వారి మధ్య ఆధిపత్యం, స్మగ్గ్లింగ్ వంటి అంశాలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ పూర్తిగా కొత్త. దీంతో పుష్ప సినిమాని వారు బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఏకంగా వంద కోట్లని ఆ సినిమా హిందీలో కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, తగ్గేదిలే అంటూ హీరో చెప్పే మేనరిజం డైలాగ్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరికి చేరువ అయ్యింది.
గెలుపుని ఆశ్వాదించే క్రమంలో ప్రతి ఒక్కరు తగ్గేదిలే అంటూ గెడ్డం మీద చేయి వేసుకొని చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఇండియన్ క్రికెటర్స్ సైతం ఈ మేనరిజంని అనుసరిస్తున్నారు. ఓ విధంగా ఈ క్రెడిట్ అంతా సుకుమార్ కె దక్కుతుంది. ఇదలా బాలీవుడ్ లో ఎక్కువ మంది చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాని తాజాగా ఓ సంస్థ ప్రకటించింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలని పక్కకి నెట్టి పుష్ప 2 మూవీ నిలవడం విశేషం.
ఈ సినిమా టాప్ 5లో మొదటి స్థానంలో ఉంది. అత్యధికులు పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సదరు వెబ్ వైట్ పేర్కొంది. ఇక దీని తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చిత్రాలు నిలవడం విశేషం. దీనిని బట్టి అల్లు అర్జున్ మానియా నార్త్ ఇండియాలో ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ని సుకుమార్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్న కూడా అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.