Puja Hegde: ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవే చూడే నా కళ్లు’పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలా? స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించిందంటే చాలు.. యూత్ అలవోకగా ఈ పాటను పాడుకుంటారు. మరి అలాంటి కాలికి ఏదో అయ్యిందన్న న్యూస్ యూత్‌ని, ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అత్యంత బిజీ హీరోయిన్‌గా పూజా హెగ్డే మారిపోయింది. వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తోంది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఒక సినిమా అలాగే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం మన బుట్ట బొమ్మ నడవలేని స్థితిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే అమ్మడికి ఏమైందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే ఫోటోపై అయితే తన కాలు లిగ్మెంట్ టియర్ అయినట్టు చెప్పింది. దీంతో నడవలేని స్థితిలో ఉంది. కాలికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజా. దీంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే కంగారేమీ అవసరం లేదని.. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. అసలు తన కాలికి గాయం ఎలా అయ్యిందనే విషయాన్ని మాత్రం పూజా వెల్లడించలేదు.
బాలీవుడ్‌లో అమ్మడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమ్మడికి సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్‌లో నటిస్తున్నప్పుడే ఈ ముద్దుగుమ్మ కాలికి లిగ్మెంట్ టియర్ అయినట్టు టాక్. కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ప్రస్తుతం బుట్టబొమ్మ ఫుల్ రెస్ట్‌లో ఉంది. అమ్మడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనగణమన’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28లో హీరోయిన్‌గా నటిస్తోంది.