Viveka Case: ఏపీలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. హత్యకు గురైన వివేకానంద రెడ్డి ఏపీ ప్రస్తుత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ కావడంతో… ఈ కేసులో రాజకీయం కోణం ఉందని ముందు నుండి అనుమానాలున్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే బాబాయ్ ని జగనే కావాలని హత్య చేయించినట్లు ఆరోపణలు గుప్పించింది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసును ఏపీ నుండి వేరే రాష్ట్రానికి బదిలే చేయాలన్న వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దాఖలును విచారించిన సుప్రీంకోర్టు.. అందుకు అంగీకరించింది. అయితే ఏ రాష్ట్రానికి మార్చాలని అనుకుంటున్నారని సునీతారెడ్డిని అడిగిన సుప్రీంకోర్టు.. తుది తీర్పును వాయిదా వేసింది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ పోలీసులు నిస్పక్షపాతంగా విచారించలేదనే వాదనలు ముందు నుండి వినిపిస్తున్నాయి. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. కాగా ఈ హత్య కేసును విచారించిన పోలీస్ అధికారి అయిన శంకరప్పకు ప్రమోషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. దీంతో ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Viveka Case:
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైయస్ వివేకానందరెడ్డి.. రాజకీయాల్లో చురుకుగా లేకపోయినా వైయస్ జగన్ మీద కాస్త అసహనంగా ఉన్నట్లు కొంతమంది చెబుతూ ఉండేవారు. దాంతో వైయస్ వివేకానంద రెడ్డి వల్ల తనకు ప్రమాదం వస్తుందనే జగన్ ఇలాంటి పని చేసి ఉంటారని కొందరు ఆరోపిస్తుంటారు. వైయస్ వివేకానంద రెడ్డిని డ్రైవర్ హత్య చేసినట్లు విచారణలో తేలగా.. ఇది రాజకీయ హత్యే అంటూ పార్టీల మధ్య వార్ మొదలవడం తెలిసిందే.