Relationship Tips: రిలేషన్ షిప్ లో పర్సనల్ స్పేస్ అనేది ముఖ్యమైన అంశం. ప్రతి విషయంలో ముందుగా పంచుకొనేది చాలామంది భాగస్వామితోనే. అయితే, చిన్నదైనా, పెద్దదైనా అన్ని విషయాలూ మీ భాగస్వామితో చెబుతున్నారా.. అయితే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే భాగస్వామితో కూడా చెప్పకూడని కొన్ని విషయాలు ఉంటాయి. వ్యక్తిగత అనుబంధాల్లో కాస్త పర్సనల్ స్పేస్ ఇచ్చి పుచ్చుకోవాలి.
బంధంలో పర్సనల్ స్పేస్ ఇవ్వటం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. మిమ్మల్ని ఏది సంతోష పెడుతుందో, మీ పనులేంటి అనే విషయాల గురించి ఆలోచనలు చేయడానికి కాస్త సమయం దొరుకుతుంది. రిలేషన్ షిప్ లో స్పేస్ అనే పదం చాలా చిన్నదైనప్పటికీ దాని ఇమ్ పాక్ట్ చాలా ఉంటుంది. అర్థం కూడా పెద్దగానే ఉంటుంది.
గందరగోళానికి ఇలా చెక్ పెట్టండి..
పరస్పర గందరగోళం ఉండకూడదంటే అది పర్సనల్ స్పేస్ ఇచ్చినప్పుడే సాధ్యమవుతుంది. మీరు మీ ఆనందం గురించి, సంతోషాల గురించి ఆలోచించే సమయం దొరుకుతుంది. ఏ విషయంలో హ్యాపీగా ఉండగలుగుతారో దానికి టైమ్ కేటాంచవచ్చు. మీ బంధంలో క్రమంగా దూరం పెరుగుతోందంటే అలాంటి సమయాల్లో కాస్త కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది.
Relationship Tips:
ప్రతి చిన్న విషయాన్నీ భాగస్వామితో పంచుకోవడం తగ్గించాలి. ఒకరి విషయాల్లో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకోరాదు. అతిగా ప్రశ్నలు వేయడం కూడా మానుకోవాలి. ఒకరి స్నేహితులను మరొకరు గౌరవించాలి. వారితో ఉన్నప్పుడు కాస్త వదిలేయడం బెటర్. విసుగు, కోపం లాంటివి తగ్గించుకుంటే మంచిది. సానుకూలత పెంచుకోవాలి. ఒకరిపై ఒకరు ప్రతి చిన్న విషయానికీ ఆధారపడకుండా ఉండాలి. రిలేషన్ షిప్ లో పర్సనల్ స్పేస్ ఇవ్వడం వల్ల సానుకూలత పెరుగుతుంది. పరస్పర బంధం దృఢంగా తయారవుతుంది. బంధంలో సమతుల్యత ఏర్పడుతుంది.