టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి జెనీలియా. బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఈ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. సత్యం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత చాలా సినిమాలలో నటించింది. ఆమెకి బాగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమాలు అని చెప్పాలి. ఇక జెనీలియా కెరియర్ బాగా ఉన్న సమయంలో తాను ప్రేమించిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపొయింది. సినిమాలకి స్వస్తి చెప్పింది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తుంది.
తెలుగులో ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జెనీలియా హిందీ సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. అలా జాన్ అబ్రహంతో ఒక సినిమాలో జోడి కట్టింది. ఇక రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పురోహితుడు జెనీలియా మీద నిర్మాతల మండలి వరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ అమ్మాయి ఇప్పటికే ఒకరిని పెళ్లి చేసుకుందని, అయితే ఇప్పుడు అతన్ని మోసం రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. ఆ విషయం విన్న అందరూ షాక్ అయ్యారంటా.
తరువాత తెలిసిన విషయం ఏంటంటే జాన్ అబ్రహం, జెనీలియా కలిసి నటించిన సినిమాలో వారిద్దరికి పెళ్లి జరిగిన సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇది నేచురల్ గా రావాలని నిజమైన పురోహితుడుని పిలిచి గుడిలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసారంట. దానికి సంబందించిన ఫోటోలు తన దగ్గర ఉండటంతో ఆ పురోహితుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆమెని కేసు వేసేందుకు సిద్దమయ్యాడు. అయితే నిర్మాతలు అసలు విషయం చెప్పడంతో పోరోహితుడు అర్ధం చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జెనీలియా పెళ్లి సమయంలో సంచలనంగా మారింది. తాజాగా జెనీలియా ఓ టీవీ షోలో ఈ ఘటన గురించి పంచుకుంది. ఇప్పుడు అదికాస్తా వైరల్ అయ్యింది.