Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కాస్తో కూస్తో కనీసం గీతూ, ఆదిరెడ్డి కారణంగా వినోదం అందుతోందని చెప్పాలి. అదేంటి అనుకుంటున్నారా….? హౌస్ లో పరిస్థితి ఇప్పుడు అలా తయారైంది. సెలబ్రిటీ గేమింగ్ లీగ్ పేరుతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల గేమ్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ సభ్యులను బిగ్ బాస్ రెండు టీంలుగా విభజిస్తారు. ఒక టీం పేరు టాలివుడ్ ఫెంటాస్టిక్స్, రెండో టీం పేరు టాలివుడ్ టైనమెట్స్. ఇందులో ఎవరు ఏ టీం, ఎవరు ఏ ప్రాత పోషించాలి అనేది బిగ్ బాస్ సూచిస్తాడు.
వారికిచ్చిన పాత్రలను చేయడానికి హౌస్ లో ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడతారు. కొందరు బాగా చేస్తారు. మరికొందరూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొందరు ఏం చేయాలో అర్ధం కాక కాసేపటికే క్యారెక్టర్ నుండి బయటికి వస్తారు. దీంతో బిగ్ బాస్ ఆగ్రహానికి గురై ఆటను రద్దు చేస్తాడు. వార్నింగ్ తో పాటు హౌస్ లో ఉన్న ఫుడ్ మొత్తం లాగేసుకుంటాడు. షో పట్ల ఆసక్తి లేకపోతే ఏకంగా హౌస్ లో నుండి బయటకి వెళ్లిపోమని చెప్తాడు.

ఈ క్రమంలో ఒక్క అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అని హౌస్ సభ్యులు అందరూ రిక్వెస్ట్ చేస్తాడు. ఆకలిలో ఉన్న వారు ఏదో ఒక గేమ్ ఆడి గెలిచి ఆకలి తీర్చుకోవాలని ఉంటుందని చెప్పి ఓ కప్పు అన్నం, ఓ కప్పు పప్పు పంపింస్తాడు. ఇంతకు ముందు ఉన్న అవే రెండు టీంలు కబడ్డీ ఆది గెలిచిన టీం అక్కడ ఉన్న ఆహారాన్ని పొందుతారు. తర్వాత మరో గేమ్ ఆడి మరోసారి ఆహారాన్ని పొందుతారు. మధ్యాహ్నం ఒక టీం గెలుస్తుంది. రాత్రికి మరో టీం గెలుస్తుంది. మొత్తానికి అలా టీంకి ఒక పూట చొప్పును ఫుడ్ దొరుకుతుంది.
ఇందులో ఆదిరెడ్డి, గీతూ వేరు వేరు టీంలలో ఉంటారు. రాత్రి ఆదిరెడ్డి తనకు వచ్చిన ఫుడ్ ను గీతూకి పంచిపెట్టి ఉంటాడు. ఇంకేముంది ఆగ్రహానికి గురైన బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఆహారం వండిన వంట సామాగ్రిని గార్డెన్ ఏరియాలో ఉంచి వాటిని శుభ్రం చేసే పనిని ఆదిరెడ్డి, గీతూకి అప్పగిస్తారు బిగ్ బాస్. ఇది సక్రమంగా జరిగేలా రాజ్ కి బాధ్యతలు అప్పగిస్తాడు. మొత్తానికి గీతూ, ఆదిరెడ్డి ఈ సీజన్ లో కష్టపడి వంట సామాగ్రిని శుభ్రం చేసేశారు.