Nandini Rai: ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే దేవుడి ముందు మాత్రం తలొంచి తీరుతాడు. దేవుడిపై నమ్మకం లేకుంటే అది వేరే విషయం. నమ్మకం ఉంటే మాత్రం తాము తలపెట్టిన ఏ కార్యక్రమానికి ముందైనా సరే దేవుడికి మొక్కే మొదలు పెడతారు. ఇక ఇండస్ట్రీలోనూ అంతే. ఏ సినిమాను ప్రారంభించినా కచ్చితంగా దేవుడి పూజ చేసి మాత్రమే మొదలు పెడతారు.సినిమా రిలీజ్‌కి ముందు కూడా దేవుడి దర్శించుకుంటారు. చివరకు సినిమా సక్సెస్ అయిన తరువాత కూడా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.
అంతటి సూపర్ స్టార్ రజనీకాంతే హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఇతర సందర్భాల్లో ఎలా ఉన్నా కూడా దేవుడి దగ్గరికి చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తారు.తాజాగా ఓ హీరోయిన్,బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ ఇటీవల తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంది. అయితే ఆమె మెట్ల దారిన నడుచుకుంటూ వెళ్లింది. ఇందులో గొప్పేం ఉంది అంటారా? ఆమె మోకాళ్లపై శ్రీవారి మెట్లు ఎక్కింది. షాకింగ్‌గా అనిపిస్తోంది కదా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మెట్లను మోకాళ్లపై ఎక్కుతున్నప్పుడు కాస్త కష్టం అనిపించినా ఆ అనుభూతి మాత్రం చాలా అద్భుతంగా అనిపించిందని నందిని తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. ఇక నందినీ రాయ్ సినిమాల విషయానికి వస్తే.. అమ్మడు ప్రతినాయికగా చేసిన ‘భాగ్ సాలే’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హిందీ సినిమా ‘ఫ్యామిలీ ప్యాక్’ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ భామ. ఇక టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు.