Priya Prakash Varrier: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రం అయినా ఒరు అధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ సినిమాగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కన్ను కొట్టిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెను ప్రియా ప్రకాష్ వారియర్ అని కాకుండా కన్ను గీటు బొమ్మ అని పిలుస్తున్నారు. అలాగే వింక్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు అభిమానులు. లవర్స్ సినిమాతో యూత్లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.
మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళం లో వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది.
ఈమె తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది.
అలాగే యంగ్ హీరో తేజా సజ్జ సరసన ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఈమె కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె స్టైలిష్ లుక్కుతో అదరగొడుతుంది. రంగు రంగుల టీ షర్ట్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ హెయిర్ స్టైల్ అలాగే మత్తెక్కించే చూపులతో యువత ద్రుష్టిని ఆకర్షిస్తోంది.