Samantha: తెలుగు ఇండస్ట్రీలో సమంత గురించి అందరికీ తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాలో నాగచైతన్య సరసన నటించి అలరించిన ఈ అమ్మడు.. తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. తర్వాత నాగ చైతన్యనే పెళ్లాడటం, ఓ నాలుగేళ్లు కాపురం చేశాక విడాకులు తీసుకోవడం కూడా అయ్యాయి. విడాకుల అనంతరం పూర్తి శ్రద్ధ సినిమాలపైనే పెడుతోంది. అందులో భాగంగా వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది సమంత.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తోంది. యశోద సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ సభ్యులు కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో వచ్చే నెల నవంబర్ 11న యశోద సినిమా రిలీజవుతోంది. హరి, హరేష్.. ఇద్దరు ఈ చిత్రానికి డైరెక్టర్లుగా ఉన్నారు. మెగా యాక్షన్ ప్యాకేజ్ గా సినిమా ఉండబోతోందని తెలిపింది చిత్ర యూనిట్. సమంతో తోపాటు ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ శివలెంక యశోద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో పాత చిత్రాలకు తన మెలోడీలతో ఉర్రూతలూగించిన మణి శర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
Samantha: విడుదలకు ముందే లాభాల పంట..
యశోద సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రిలీజ్ కు ముందే నిర్మాతలకు ఏకంగా 8 కోట్ల లాభం వచ్చిందని సమాచారం. సినిమాకు అనుకున్న రేంజ్ కంటే మించి బిజినెస్ వచ్చిందట. దీనికి తోడు అటు ఓటీటీ, ఇటు శాటిలైట్ రైట్స్ కు మంచి ధర పలుకుతోందట. దీంతో నిర్మాతలు ఫుల్ ఖుషీ అయ్యారు. విడుదలకు ముందు ఇలా ఉంటే ఇక సినిమా విడుదలయ్యాక ఇంకెత బిజినెస్ వస్తుందోనని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు నిర్మాతలు.