Jacqueline Fernandez : చీరలు మగువల బెస్ట్ ఫ్రెండ్స్. బాలీవుడ్ ఫ్యాషన్ వాదులకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన కొత్త ఫోటో షూట్ కోసం చీర కట్టుకుని ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు అందమైన పసుపు రంగు చీరకట్టుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని మంత్రముగ్ధులను చేసింది ఈ మాయ లేడీ. ఈ హాట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైకులు , షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Jacqueline Fernandez : జాక్వెలిన్ స్టైలిస్ట్ ఛాందిని వాభీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన పుసుపు చీరకట్టుకున్న ఈ రామ్ సేతు నటి పిక్స్‌ను పోస్ట్ చేసింది. చీరలో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుండటంతో జాక్వెలిన్ పైనే అందరి చూపు మళ్లింది. ఈ అందమైన చీరను సబ్యసాచి ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది జాక్వెలిన్.

దీపావళి సీజన్ దగ్గర పడుతుండటంతో ఈ చీరకట్టుతో ఫెస్టివ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది జాక్వెలిన్. పూజా కార్యక్రమాలైనా , లేట్ నైట్ పార్టీలైనా , చుట్టాలింటికి పండుగ రోజు వెళ్లాలన్నా ఈ చీర పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఈ చీరకు మ్యాచింగా హెవీ జ్యువెల్లరీ వేసుకుంటే పండుగ మీ వెంటే ఉన్నట్టే.
పసుపు రంగులో వచ్చిన ఈ షిఫాన్ చీరను సాంప్రదాయంగా కట్టుకుంది. కొంగును అలా భుజాల మీదనుంచి జారవిడిచి వయ్యారంగా కెమెరాకు ఫోజులు ఇచ్చింది. గోల్డ్ గోటా పట్టీ బార్డర్లు, అప్లిక్, సీక్విన్ వర్క్‌తో పాటు ఫ్లోరల్ ప్యాట్రన్స్‌తో శారీని ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు డిజైనర్లు. ఈ చీరకు మ్యాచింగ్‌గా వైడ్ యూ నెక్‌లైన్, ప్లంగింగ్ బ్యాక్, బ్రాడ్ స్ట్రాప్స్ బ్యాక్ హుక్కులతో వచ్చిన అదే రంగులో ఉన్న స్టైలిష్ బ్లౌజ్‌ను ధరించి కనువిందు చేసింది .

చీరకు తగ్గట్లుగా మ్యాచింగ్ హై హీల్స్ వేసుకుంది జాక్వెలిన్. చేతికి స్లీక్ బ్రేస్‌లెట్, ఎమరాల్డ్స్, కాస్ట్‌లీ స్టోన్స్‌తో పొదిగిన ఉంగరాలను చేతి వేళ్లకు పెట్టుకుంది. చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని కుర్రాళ్లను కవ్వించింది జాక్వెలిన్. తన కురులతో మధ్య పాపిట తీసి లూజ్‌గా వదులుకుంది. కనులకు షిమ్మరింగ్ పింక్ ఐ ష్యాడో, బోల్డ్ బ్లాక్ వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు మావీ లిప్ షేడ్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాను జామ్ చేసింది.

200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఇన్‌టర్మీ బేయిల్ పొందిన జాక్వెలిన్ వరుసపెట్టి ఈవెంట్‌లకు హాజరవుతూ వస్తోంది. ఈ మధ్యనే జరిగిన ఇటాలియన్ స్క్రీన్స్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైంది. ఇక మూవీస్ విషయానికి వస్తే జాక్వెలిన్ అక్షయ్ కుమార్‌తో కలిసి రామ్ సేతు సినిమాలో నటిస్తోంది. దీపావళి రోజు ఈ సినిమా విడుదల కాబోతోంది. అమ్మడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది.
