మెగా ఫ్యామిలీ హీరోలుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కూడా పాన్ ఇండియా హీరోలుగా ఇండియన్ వైడ్ గా తనకంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ తమ ఇమేజ్ లని అమాంతం పెంచుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం వీరిద్దరి స్టామినా మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ. చిరంజీవి ఇంకా తన ఇమేజ్ ని టాలీవుడ్ వరకే పరిమితం చేసుకున్నారు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏకంగా 200 కోట్ల హీరోలు అయిపోయారు. దర్శకులు కూడా వారితో అదే రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వీరిద్దరి కలయికలో గతంలో ఎవడు అనే సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించేది కొద్దిసేపే అయినా సినిమా మొత్తం అతని ఇంపాక్ట్ ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో హీరో రామ్ చరణ్ అనే కంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ అని అని చెప్పాలి. ఇక ఆ సమయంలోనే అల్లు అర్జున్ చరణ్, బన్నీతో ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించాలని చరణ్-అర్జున్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు. అయితే తరువాత దానిపై ఎలాంటి న్యూస్ లేదు.
అప్పట్లో వారి కలయికలో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించింది. అయితే అదేదీ సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత అల్లు అరవింద్ ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికి చరణ్-అర్జున్ టైటిల్ తన దగ్గర ఉందని చెప్పాడు. అలాగే భవిష్యత్తులో వారిద్దరి కలయికలో కచ్చితంగా మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారు. అయితే ఈ సారి వారి మార్కెట్ పరిధికి తగ్గట్లుగానే ఆ మూవీ ఉండే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పారు. అయితే ఎప్పుడు ఉంటుందనేదాని మీద మాత్రం అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వలేదు.