Prabhas: డార్లింగ్ ప్రభాస్ కు దర్శకుడు మారుతి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ గుసగుసలు. అయితే బాహుబలి వంటి సినిమాలతో హెవీ క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. ఇటీవల “రాధేశ్యామ్” వంటి సినిమాలతో కొంచెం నెగటివ్ టాక్ పొందాడు. ఈ సందర్భంలో.. సినిమాలు, స్టోరీల ఎంపికలో ప్రభాస్ మరింత జాగ్రత్తగా ఉండాలని అభిమానులతో పాటు, సినీ వర్గాల నిపుణులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అంత సింపుల్ గా మారుతితో సినిమా ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడం కాదండీ మారుతికి ఇచ్చిన మాట కోసం ఇప్పటికే ఆ అతనితో సినిమాకు రెడీ అయిపోయాడు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ లు వున్నా.. మారుతితో సినిమా చేయాల్సిన అవసరం ఏముంది అంటూ.. కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కి.. సంబంధింత ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి కూడా. ఇది ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై, టి.జి. విశ్వప్రసాద్ భారీ స్థాయిలో ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించనున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఫైనల్ అయ్యారు. ‘మాస్టర్’ ఫేమ్ మాళవికా మోహనన్ ఒకరు, మరొకరు నిధి అగర్వాల్. అయితే త్వరలోనే మరో క్రేజీ హీరోయిన్ ని సెలెక్ట్ చేయనున్నారు. బుధవారం నుండి ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్ వారం రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక న్యూస్ తో ప్రభాస్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Prabhas:
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు జరగనున్న నేపథ్యంలో అదే రోజున ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్టు సమాచారం. అందుకు ప్రభాస్ పై లుక్ టెస్ట్ కి సంబంధించిన ఫొటో షూట్ ని చిత్ర బృందం పూర్తి చేసేసింది. ఈ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేసి దానితో మారుతి ప్రభాస్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నట్టు తెలియడంతో.. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.