Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఖుషి’. మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతలు కనిపించగా.. ఫుల్ లెన్త్ లో మాత్రం కనిపించలేదు. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ గా నిలువగా.. విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాతో హిట్ కొట్టాలని బలంగా అనుకుంటున్నాడు.
లైగర్ సినిమా ప్రమోషన్లో బిజీగా గడపడం వల్ల విజయ్ దేవరకొండ‘ఖుషి’ మీద ఫోకస్ పెట్టలేకపోగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఈ సినిమా మీదే పని చేయాలని అనుకుంటున్నాడట. ఎలాంటి గ్యాప్ లు లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దేవరకొండ ప్లాన్ చేస్తుండగా.. హీరోయిన్ సమంత అందుబాటులో లేకపోవడంతో అయోమయ స్థితి ఏర్పడిందట.
గతంలో కాశ్మీర్ వెళ్లి ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఖుషి టీం.. అక్కడ సమంతకు సర్ ప్రైజ్ బర్త్ డే పార్టీ ఇవ్వడం వార్తల్లో నిలిచింది. తర్వాత ఆమె అమెరికాకు వెళ్లడంతో షూటింగ్ కు హాజరుకాలేకపోయింది. సమంత, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సీన్లు షూటింగ్ జరగాల్సి ఉండగా.. సమంత కోసం విజయ్ ఎదురుచూస్తూ ఉన్నాడు.
Vijay Devarakonda:
మొత్తానికి వచ్చే నెల నుండి సమంత తిరిగి షూటింగ్ కు వస్తుందని ఖుషి టీం ప్రకటించింది. నవంబర్ నెలలో ఈ సినిమా భారీ షెడ్యూల్ షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులను బాగా అలరిస్తుందనే అంచనాలు ఉంటాయి. మొత్తానికి భారీ అంచనాల మధ్య ఖుషి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుండటం తెలిసిందే.