Rashmi Gautam : టైటిల్ చూసి.. యాంకర్ రష్మీ గౌతమ్‌కి గీతా మాధురి భర్తకు సంబంధం ఏంటి? ఆయనెందుకు ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు.. అనుకుంటున్నారా? దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను తాజాగా రిలీజ్‌కు సిద్ధమైంది. నందు చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. రష్మీ కూడా అప్పుడెప్పుడో హీరోయిన్‌గా ఒక సినిమా చేసి అది డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇప్పటి వరకూ సినిమాలు చేసింది లేదు. తిరిగి నందు సరసన అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమాపై నందు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపైనే నందు ఆశలన్నీ పెట్టుకున్నాడు. దీనికోసం వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు. గతంలో బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా నందు ఆ మధ్య తన సినిమా టైటిల్ ప్రకటన మీద ప్రమోషన్స్ చేయడంతో అంతా ఇంకేముంది నందు బిగ్‌బాస్‌కి వస్తున్నాడంటూ రచ్చ రచ్చ చేశాడు. అలా కొద్దిరోజులు ఊరించి మెల్లిగా అసలు విషయాన్ని చెప్పాడు. చివరకు బీబీ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని చావు కబురు చల్లగా చెప్పేశాడు.
మనోడు వెరైటీ ప్రమోషన్స్‌తో తమ సినిమాను అందరి నోళ్లలో నానేలా చేస్తున్నాడని ఇప్పుడే కదా చెప్పుకున్నాం. అలాంటిదే మరొకటి చేశాడు. సినిమా ప్రమోషన్స్ ప్రారంభించినా రష్మీ సహకరించడం లేదని.. ఆమె అసలు ప్రమోషన్స్‌కు రావడం లేదంటూ నందు ఆందోళన చెందారు. అంతేనా? ఎందుకు ప్రమోషన్లకు రావడం లేదని.. ఫోన్లు ఎత్తడం లేదని నిలదీశారు. ఇక రష్మీ ఏమైనా తక్కువ తిన్నదా? తనకు ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పేసింది. టోటల్‌గా వీరిద్దరి కాన్వర్సేషన్‌ను బట్టి చూస్తే మరో వెరైటీ ప్రమోషన్స్‌కు తెరదీసినట్టు తెలుస్తోంది.