Virat Kohli: ఫిట్ నెస్ విషయంలో విరాట్ కోహ్లి ఎంత శ్రద్ధ వహిస్తాడో మన అందరికి తెలుసు. ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. టీమిండియా నుంచి ఫిట్ నెస్ విషయంలో మనకు గుర్తుకు వచ్చే క్రికెటర్లు ఎవరంటే హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి. మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో చేస్తూ ఈ ఆటగాళ్లు టీమిండియా విజయాల్లో కీలకంగా మారుతున్నారు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులో విరాట్ కోహ్లీ కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేశాడు. ఒక రన్ అవుట్ చేసి, ఆ తర్వాత బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఈ తరహా ఫీల్డింగ్ ను ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండరు. స్టన్నింగ్ ఫీల్డింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నాడు.
ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో టిమ్ డేవిడ్ ను రనౌట్ చేశాడు. ఒకవేళ టిమ్ డేవిడ్ క్రీజులో ఉంటే టీమ్ ఇండియా విజయం సాధించే అవకాశం ఉండేది కాదు. టిమ్ డేవిడ్ ఎంత విధ్వంసకర ఆటగాడో మనందరికీ తెలుసు. ఇక చివరి ఓవర్ లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరమైన సమయంలో బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ తో కమ్మిన్స్ ను అవుట్ చేశాడు. దీంతో టీమిండియా 6 పరుగులతో విజయం సాధించింది. ఈ ఫీట్లను చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Virat Kohli:
ఇలాగే హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫీల్డింగ్ లో మంచి ప్రదర్శన చేస్తే ప్రత్యర్ధి జట్లను తక్కువ పరుగులకే కట్టడి చేయవచ్చు. సూపర్ -12లో మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియా అలవోకగా సెమీస్ చేరుకుంటుంది. దాని తరువాత నవంబర్ 13న జరిగే ఫైనల్లో టీం ఇండియాను చూసే అవకాశం అభిమానులకు ఉండనుంది. దీనికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి
this too today pic.twitter.com/jy3SySzrgK
— Nijil Mohanan (@nijilzz) October 17, 2022