Vastu Tips: ఈ మధ్య కాలంలో వాస్తు చూడనిది ఇంటి పనులను మొదలు పెట్టట్లేదు. అలా గృహ నిర్మాణ సమయంలో వాస్తు శాస్త్రాన్ని చూడడం ఇప్పటి పద్దతి కాదు. మన పూర్వీకుల కాలం నుంచే ఉంది. అలా గృహ నిర్మాణ సమయంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి మరియు నూతన గృహంలో ఎటువంటి సమస్యలు మరియు చికాకులు రాకుండా ఉండడానికి వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు.
ఇళ్లు కట్టే ముందు ప్రధాన ద్వారం ఎటు వైపు ఉండాలి అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు , పడమరలో ఉండాలి. ముఖ ద్వారం దక్షిణం వైపు ఉంటే మాత్రం ఇంటికి అంత మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంటి ముఖ ద్వారం ఎప్పుడు సవ్య దిశలోనే ఉండాలి ఇంటి ముఖ ద్వారం వద్ద బాత్రూమ్ లాంటివి ఉండకూడదు. ఇది ఇంటికి అరిష్టం. గడపకి ఎప్పుడు పసుపుని రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేదు ప్రభావిత శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి.
ఇక ప్రధాన ద్వారం రంగు విషయంలో ఎప్పటికి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏది పడితే ఆ రంగుని వేస్తూ ఉంటారు. అలా వేయకుండా ప్రకాశవంతంగా ఉండే రంగులను మాత్రమే వాడాలి. ప్రధాన ద్వారం లేత పసుపు రంగులో ఉంటే ఇంకా మంచిది. అలా పసుపు రంగును వాడితే ఇంటికి చాలా శుభప్రదం.
Vastu Tips:
అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త బుట్టలు మాత్రం పెట్టకూడదు. ఎప్పుడు ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన కుర్చీలను పెట్టకూడదు. అలాగే ప్రధాన ద్వారానికి పచ్చని తోరణాలు ఉండాలి. కనీసం పండుగల సమయంలోనైనా ఇవి ఉండేలా చూసుకోండి. కొంత మంది బద్దకంతో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు.