డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆదిపురుష్ టీజర్ అయితే ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ కి సమీపిస్తోంది. ఇండియన్ ఇండస్టీలో ఒక్క టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమానే చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లోనే ఒక మైలేజ్ మూవీగా ఇది ఉండబోతుంది అని ఇప్పటికే తెలుస్తుంది. ప్రభాస్ కూడా చాలా ఇష్టంతో సినిమాని చేశాడు. సెలబ్రెటీలు అందరి నుంచి టీజర్ కి మంచి ప్రశంసలు లభించాయి.
విఎఫ్ఎక్స్ వర్క్ అంతగా బాగోలేదని పెదవి విరిచిన సిల్వర్ స్క్రీన్ పై త్రీడీలో చూసిన తర్వాత కొంత మార్పు వచ్చింది. అయితే కంటెంట్ ని అలాగే పాత్రలని కాస్తా మార్చేశారంటూ వివాదం చేస్తున్నారు. అయితే వీటిపై ఓం రౌత్ టీమ్ క్లారిటీ ఇచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. భారీ ఎత్తున ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రభాస్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు.
ఇక ఆదిపురుష్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ ఇప్పుడు వచ్చి చేరింది. వరల్డ్ వైడ్ గా గత 30 రోజుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో ఆదిపురుష్ అప్డేట్స్, టీజర్ టాప్ లో ఉంది. ఈ విషయాన్ని ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ తన ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాల నుంచి కూడా కీలక అప్డేట్స్ ని ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే ఆ అప్డేట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.