Sai Pallavi : మన హీరోయిన్లు వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి జిమ్ లో ఎంతగా వర్కౌట్ చేస్తారో మనకు తెలుసు. రోజులో కొంత సమయాన్ని వారు ఖచ్చితంగా వర్కౌట్లకు కేటాయిస్తారు. హీరోయిన్స్ కు తమ అందం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా వర్కౌట్లు అవసరం.
ఇటీవల కాలంలో హీరోయిన్లు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. హీరోయిన్ గా వారి క్రేజ్ పెరిగే కొద్దీ వ్యాయమం పట్ల ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కానీ వీటన్నిటికీ మినహాయింపుగా సాయి పల్లవి యోగా, వ్యాయమం, డైట్ ఇలాంటివి ఏవీ చేయదట. ఇంకా చెప్పాలంటే కనీసం వాకింగ్ కూడా చేయదట. మరి మొదటి నుంచి ఈ భామకు ఇంత అందం ఎలా సొంతం అంటే దీనికి ప్రధాన కారణం ఆమె పాటించే ఆహార నియమాలు .
సాయి పల్లవి పూర్తిగా శాకాహారి ఆమె కేవలం ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తీసుకుంటుంది. అలాగే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటుంది. ఇక షూటింగులకు వెళ్ళినప్పుడు చుట్టూ రకరకాల ఆహార పదార్థాలు ఉన్నా కూడా ఆమె తీసుకోదు. కేవలం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ ఏవైనా తినాలి తాగాలి అనిపిస్తే అలాంటి కోరికలను నియంత్రించుకుంటుందట. ఇలా ఉండడం ఆమెకు మొదట్లో కష్టంగానే అనిపించినా రాను రాను అలవాటు అయిపోయిందట. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ మాత్రం ఆడుతుంది.
Sai Pallavi :
అంటే ఈ భామ డైట్ విషయంలో మహేష్ బాబు ని ఫాలో అవుతుందన్నమాట. మహేష్ బాబు డైట్ లో కూడా ఎలాంటి నియమాలు ఉండవు. ఆయన ఏది కావాలన్నా మితంగా తింటారు. అతిగా తినరు . సమయానికి నిద్రపోతారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటారు. కానీ మహేష్ బాబు కి సాయి పల్లవికి ఒక్క విషయంలో మాత్రం తేడా ఏంటంటే మహేష్ బాబు వర్కౌట్లు చేస్తారు సాయి పల్లవి వర్కౌట్లు చేయదు. వర్కౌట్లు చేయకుండానే సాయి పల్లవి అంత అందాన్ని మెయింటైన్ చేస్తోంది.