Diwali Movies: తెలుగు వాళ్లకు పండగ ఏది వచ్చినా సినిమాలు చూడటం అలవాటు. ప్రతి పండగకు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్యన ఓటీటీల హవా విపరీతంగా నడుస్తున్న నేపథ్యంలో.. ఓటీటీల్లో ఏఏ సినిమాలు వస్తున్నాయనే ఆసక్తి అందరిలో వస్తోంది. మరి ఈ దీపావళికి అందరినీ అలరించడానికి వివిధ ఓటీటీ వేదికల మీద వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం.
బింబిసార:
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ‘బింబిసార’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ ఫస్ట్ డే కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాలో.. కేథరిన్, సంయుక్తా మీనన్ లు నటించారు. ఈ సినిమా జీ5లో అక్టోబర్ 21న స్ట్రీమింగ్ కానుంది.
ఒకే ఒక జీవితం:
మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా సోనీలివ్ లో అక్టోబర్ 21వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు నటించారు.
వీటితో పాటు జీ5 ఓటీటీ వేదిక మీద ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ‘ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్’ (హాలీవుడ్) అక్టోబరు 19వ తేదీన, ‘బార్బేరియన్స్’ (వెబ్‌సిరీస్-2) అక్టోబరు 21న, ‘ఫ్రమ్ స్క్రాచ్’ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 న స్ట్రీమింగ్ కానున్నాయి.
Diwali Movies:
మరో ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ లో అమ్ము (తెలుగు) అక్టోబరు 19న, ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21న, ఫోర్ మోర్ షాట్స్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21న స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే ఆహాలో పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21న స్ట్రీమింగ్ కానుంది.