IPL-2023: IPL-2023 మినీ వేలానికి తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోనే ఈసారి కూడా గత సీజన్ లాగే వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మినీ వేలాన్ని డిసెంబర్ 16న నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా బీసీసీఐ బోర్డుకు చెందిన ఉన్నత అధికారుల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజీనామా చేయడంతో ఎక్కడ నిర్వహిస్తారో అని కొంత మేర ఆందోళన కలిగించింది. ఈ మధ్య జరిగిన ఏజీఎం సమావేశంలో ఐపీఎల్ 2023 మినీ వేలానికి సంబంధించిన అంశాలను చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రతి ఫ్రాంచైజీ పర్సును రూ.90కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్టోబర్ 18న జరిగే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
బోర్డు పెద్దల్లో ఒకరైన జయ్ షా ఐపీఎల్ చైర్మన్ గా ఐపిఎల్ 2023ని నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగా ఇంటా బయట మ్యాచులు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్న క్రికెటర్లు వేరే ఫ్రాంచైజీలకు ఆడే అవకాశాలు ఉన్నాయి. రిటెన్షన్ పద్ధతిలో కొందరు ఆటగాళ్లను సొంత జట్లే తిరిగి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
IPL-2023:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రవీంద్ర జడేజా, గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి శుభ్ మన్ గిల్ తప్పుకుంటున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు T20 వరల్డ్ కప్ -2022 కొనసాగుతున్నందున ఈ టోర్నీలో ప్రదర్శనను ఆధారంగా చేసుకుని ఆటగాళ్ళను ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జరుగుతున్నందున ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన రంజీ క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.