Weight Gain: మనలో చాలామందికి బరువు పెరగడం అస్సలు ఇష్టం ఉండదు. ఎలాగైనా బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు మాత్రం బరువు పెరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఆర్టికల్ లో ఏఏ ఆహారాలను మధ్యాహ్నం పూట తింటే బరువు పెరుగతారో తెలుసుకుందాం. బరువు పెరగాలని అనుకునే వారు వీటిని తింటే సరిపోతుంది, అలాగే బరువు తగ్గాలనుకునే వారు వీటిని నివారించండి.
మధ్యాహ్నం పూట భోజనంలో చాలా వరకు అన్నం తింటూ ఉంటారు. అన్నం అంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి ఎక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్లు అందితే, బరువు పెరగడం జరుగుతుంది. ఒకవేళ మీరు బరువు పెరగాలనుకుంటే మధ్యాహ్నం అన్నం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం అన్నానికి దూరంగా ఉండండి.
బరువు తగ్గాలని చూసే వారు మధ్యాహ్నం పూట చపాతీలు తింటే మంచిది. బియ్యంతో పోలిస్తే చపాతీల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పైగా చపాతీల్లో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వు తక్కువగా ఉంటాయి. బియ్యంలో ఎక్కువ కాలరీలు ఉంటే, చపాతీలు మాత్రం తక్కువ కాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మధ్యాహ్నం చపాతీలు తినడం ఉత్తమం.
Weight Gain:
బరువు తగ్గాలని మీరు ఒకవేళ ప్లాన్ చేస్తుంటే మధ్యాహ్నం పూట అన్నానికి బదులుగా ఓట్స్ తినడం మంచిది. ఎందుకంటే ఓట్స్ లో ప్రోటీన్లు, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. దీనికి తోడు బరువు తగ్గడానికి పనికి వచ్చే ఫైబర్ కంటెంట్ ఓట్స్ లో ఎక్కువగా ఉంటుంది. పైగా ఓట్స్ లో తక్కువ కాలరీలు ఉంటాయి.