Diabetics: మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య మన దేశంలో అయితే విపరీతంగా పెరుగుతోంది. అనేక రకాల అనారోగ్య సమస్యలకు నిలయంగా షుగర్ వ్యాధి ఉండటంతో.. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.
మారిన ఆహారపు అలవాట్లకు తోడు జీవన శైలి వల్ల చాలామంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ ఎక్కువైతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలతో ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి షుగర్ బారిన పడ్డ వాళ్లు అది మరింత ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
షుగర్ పేషంట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరానికి అధికంగా శ్రమ కలిగించకపోయినా.. శరీరానికి కాస్త అలసట అనిపించేలా వర్కవుట్ చేస్తే సరిపోతుంది. వయసుకు తగ్గట్టుగా వర్కవుట్ చేస్తే మంచిదని నిపుణులు సలహాలిస్తుంటారు. షుగర్ తో బాధపడే వారు ప్రతిరోజు ఉదయం పూట లేదంటే సాయంత్రం వేళ వాకింగ్, జాగింగ్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
శరీరానికి అధికంగా శక్తినిచ్చే ఆహారాలను షుగర్ పేషంట్లు తగ్గించాలి. అలాగే తిన్న తర్వాత కాసేపటికి కనీసం 10 నిమిషాల పాటు నడవాలి. ఇలా చేస్తే రక్తంలో చక్కెన స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు స్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలైన ద్రాక్ష, అరటిపండు, పుచ్చకాయలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, బ్రెడ్, కూల్ డ్రింక్స్ ను తీసుకోకూడదు.
Diabetics:
షుగర్ పేషంట్లు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా రెస్ట్ తీసుకోకుండా.. శారీరక శ్రమ వీరికి అవసరం. రెగ్యులర్ గా మందులను వాడుతూ, డాక్టర్లు చెప్పే సూచనలను పాటించడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది.